కెమెరామెన్ ఫోకస్ ఎక్కడ బ్రో.. ఇంత అందాన్ని మర్చిపోయారా? | Varalaxmi Sarathkumar Visuals Goes Viral In IPL Match At Chennai | Sakshi
Sakshi News home page

ఇంత అందంగా ఉన్నావే.. ఎవరే నువ్వు?.. నెటిజన్ పోస్ట్ వైరల్!

Published Wed, Mar 27 2024 6:48 PM | Last Updated on Wed, Mar 27 2024 7:29 PM

Varalaxmi Sarathkumar Visuals Goes Viral In IPL Match At Chennai - Sakshi

కోలీవుడ్ భామ  ఇటీవలే హనుమాన్‌ సినిమాతో అలరించారు. తేజ సజ్జాకు అక్కా పాత్రలో తనదైన నటనతో మెప్పించారు. గతేడాది టాలీవుడ్‌లో వీరసింహారెడ్డి, కోటబొమ్మాళి పీఎస్ చిత్రాలతో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నారు. అయితే గతంలో చాలా ఇంటర్వ్యూల్లో తన పెళ్లి గురించి దాటవేస్తూ వచ్చిన బ్యూటీ.. ఇటీవలే ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. ముంబైకి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయి సచ్‌దేవ్ అనే వ్యక్తిని మార్చి 1న ముంబైలో నిశ్చితార్థం చేసుకుంది. ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ఆమెనే లేడీ విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మీ శరత్‌ కుమార్‌.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఐపీఎల్‌ మ్యాచ్‌లో తళుక్కున మెరిసింది. చెన్నై, గుజరాత్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో వరలక్ష్మి సందడి చేసింది. చెపాక్ స్టేడియంలోని స్టాండ్స్‌లో వరలక్ష్మి నిలబడి మ్యాచ్‌ను ఎంజాయ్‌ చేస్తున్న వీడియోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. వీడియోతో పాటు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇవాళ మ్యాచ్‌లో కెమెరామెన్ ఫోకస్ ఎక్కడ పెట్టారు.. ఈ అందాన్ని గుర్తించడం ఎలా మరిచిపోయారు? అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఆ వీడియో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement