వరలక్ష్మి హారర్ థ్రిల్లర్‌.. సూపర్‌స్టార్ కృష్ణపై స్పెషల్ సాంగ్ | Varalakshmi Sarathkumar latest movie police complaint special song | Sakshi
Sakshi News home page

Police Complaint Movie: వరలక్ష్మి హారర్ థ్రిల్లర్‌.. సూపర్‌స్టార్ కృష్ణపై స్పెషల్ సాంగ్

Jun 8 2026 9:21 PM | Updated on Jun 8 2026 9:24 PM

Varalakshmi Sarathkumar latest movie police complaint special song

నవీన్ చంద్ర, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం పోలీస్ కంప్లైంట్‌. ఈ మూవీ హరర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార గీతాలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి పెంచేశాయి.

తాజాగా కృష్ణసాయి, కృతి వర్మలపై చిత్రీకరించిన ప్రత్యేక గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. సూపర్‌స్టార్ కృష్ణపై రూపొందించిన ఈ గీతం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సూపర్‌స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతం మరింత ఆకర్షణగా నిలిచింది. ఈ పాటను వీక్షించిన సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. పాట అద్భుతంగా వచ్చిందని ప్రశంసిస్తూ, సినిమా ఘన విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.

దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. 'సూపర్‌స్టార్ కృష్ణ గారి సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కృష్ణపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని మెచ్చుకోవడం మా యూనిట్‌కు ఎంతో గర్వకారణం. ఆయన ఆశీర్వాదాలు మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ చిత్రాన్ని 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో కేవలం 45 రోజుల్లో పూర్తి చేశాం. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే వైవిధ్యమైన కాన్సెప్ట్ చుట్టూ కథ సాగుతుంది. హారర్ థ్రిల్లర్ అంశాలతో పాటు యాక్షన్, ఎమోషన్స్ ఉండే ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది” అన్నారు. ఈ మూవీలో కృష్ణసాయి, రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, పృథ్వి, కృతి వర్మ, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి కీలక పాత్రల్లో నటించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement