వనిత నివాసంలో కుబేర పూజ | Vanitha Vijayakumar And Peter Paul With Currency Garland | Sakshi
Sakshi News home page

కరెన్సీ మాలతో వనిత, పీటర్‌పాల్‌ 

Sep 13 2020 7:29 AM | Updated on Sep 13 2020 1:53 PM

Vanitha Vijayakumar And Peter Paul With Currency Garland - Sakshi

చెన్నై : నటి వనిత విజయ్‌కుమార్‌  పీటర్‌ పాల్‌ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకుని పెద్ద వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే. నటి కస్తూరి, దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్‌ వనిత మూడో పెళ్లి చేసుకోవడంపై విమర్శల దాడి చేశారు. దీంతో వనిత కూడా వారిపై ఎదురుదాడి చేసింది. ఈవ్యవహారం కేసులు, కోర్టు వరకు దారి తీసింది. ఈ పరిస్థితుల్లో వనిత భర్త పీటర్‌ పాల్‌ గుండెపోటుకు గురై చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యంగా తిరిగి వచ్చారు. ( వనితా విజయకుమార్‌ భర్తకు గుండెపోటు )

తాజాగా వనిత, పీటర్‌ పాల్‌ కరెన్సీ మాలను మెడలో ధరించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలను వనిత తన ఇన్‌స్టాగ్రాంలో పేర్కొంటూ తన ఇంట్లో లక్ష్మీ కుబేర పూజను నిర్వహించినట్లు పేర్కొంది. 2020లో ఇకపై వచ్చే రోజులు అందరికీ మంచి జరగాలని కోరుకున్నట్లు చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement