Vanitha Vijayakumar About Her Struggles in life Deets Inside - Sakshi
Sakshi News home page

Vanitha Vijaya Kumar: నా తండ్రే నన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు

Feb 2 2022 1:14 PM | Updated on Feb 2 2022 2:07 PM

Vanitha Vijayakumar About Her Struggles And Father - Sakshi

నాన్న నాకు ఏదీ ఇవ్వకూడదనుకున్నారు. మా అమ్మ చనిపోయాక నాకు ఆస్తిపాస్తులు దక్కకూడదని డిసైడ్‌ అయ్యాడు. నన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు..

అలనాటి స్టార్‌ కపుల్‌ మంజుల - విజయ్‌ కుమార్‌ల పెద్ద కూతురే నటి వనితా విజయ్‌ కుమార్‌. కోలీవుడ్‌లో సత్తా చాటుతూ టాలీవుడ్‌లోనూ పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న వనితా విజయ్‌ కుమార్‌ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. చిన్న వయసులోనే పెళ్లి పీటలెక్కిన ఆమె మూడు పెళ్లిళ్లు చేసుకోగా అవన్నీ పెటాకులే అయ్యాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కష్టాలను ఏకరువు పెట్టింది.

'మా అమ్మ ఎంతో కష్టపడి స్టార్‌ హోదా సంపాదించుకుంది. మాకోసం రాత్రింబవళ్లు షూటింగ్‌ల వెంట పరుగులు పెడ్తూ డబ్బులు కూడబెట్టింది. అమ్మకు మేము ముగ్గురం కూతుళ్లం. ఏదైనా మాకు సమానంగా రావాల్సిందే. కానీ నాన్న నాకు ఏదీ ఇవ్వకూడదనుకున్నారు. మా అమ్మ చనిపోయాక నాకు ఆస్తిపాస్తుల్లో చిల్లిగవ్వ కూడా దక్కకూడదనుకున్నారు. నామీదే కేసులు పెట్టారు. ఈ విషయంలో నేను సుప్రీంకోర్టు దాకా వెళ్లాను.

తమిళనాడులో నాకు అడ్రస్‌ లేకుండా చేస్తానని నాన్న నాతో ఛాలెంజ్‌ చేశాడు. కానీ ఇప్పుడు తమిళ ప్రజలకు నేను దగ్గరయ్యాను. అందుకు హ్యాపీగా ఫీలవుతున్నా. మా ఫ్యామిలీలో ఎవరిని కదిలించినా వాళ్లంతా కూడా నేను ఆ కుటుంబంలో లేనని చెప్తుంటారు. వాళ్లకు నామీద ఎందుకంత కోపమో నాకిప్పటికీ తెలియదు. ఒకసారైతే నాన్న పోలీసులను పిలిపించి మా అమ్మ ఇంట్లోంచి నన్ను బయటకు గెంటేశారు. నాకు సంబంధించిన వస్తువులు, డబ్బులు కూడా ఆ ఇంట్లోనే ఉండిపోయాయి. కట్టుబట్టలతో పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాను. ఇక పెళ్లి సంగతి అంటారా? చిన్న వయసులో వివాహం చేయడం వల్లే నా పెళ్లిళ్లు ఎంతోకాలం నిలవలేవు' అని చెప్తూ ఎమోషనల్‌ అయింది వనిత.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement