Vaisshnav Tej: Uppena Hero Next Movie Titled As Ranga Ranga Vaibhavanga - Sakshi
Sakshi News home page

Vaisshnav Tej: వైష్ణవ్‌ తేజ్‌ సినిమాకు 'రంగ రంగ వైభవంగా' టైటిల్‌ ఫిక్స్‌

Jan 24 2022 11:54 AM | Updated on Jun 27 2022 12:36 PM

Vaisshnav Tej Next Movie Titled As Ranga Ranga Vaibhavanga - Sakshi

ఇందులో యంగ్‌ బ్యూటీ కేతిక శర్మ వైష్ణవ్‌తో జోడీ కట్టింది. అమ్మాయిలు ట్రీట్‌ ఇవ్వాలంటే ఏం తీసుకురానక్కర్లేదు అంటూ హీరోకు బటర్‌ ఫ్లై కిస్‌ను బహుమతిగా ఇచ్చింది. ఇది నెక్స్ట్‌ లెవల్‌లో

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ 'ఉప్పెన' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. తొలి సినిమాతోనే వంద కోట్ల క్లబ్‌లో చేరి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలకు సంతకం చేశాడు. ఈ క్రమంలో వచ్చిన 'కొండపొలం' పెద్దగా విజయం సాధించలేకపోయింది. తాజాగా తన మూడో సినిమాను అధికారికంగా ప్రకటించాడు వైష్ణవ్‌. 

గిరీశాయ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు 'రంగ రంగ వైభవంగా' అనే టైటిల్‌కు ఫిక్స్‌ చేశారు. ఈ మేరకు సోమవారం(జనవరి 24) టైటిల్‌ టీజర్‌ను కూడా వదిలారు. ఇందులో యంగ్‌ బ్యూటీ కేతిక శర్మ వైష్ణవ్‌తో జోడీ కట్టింది. అమ్మాయిలు ట్రీట్‌ ఇవ్వాలంటే ఏం తీసుకురానక్కర్లేదు అంటూ హీరోకు బటర్‌ ఫ్లై కిస్‌ను బహుమతిగా ఇచ్చింది. ఇది నెక్స్ట్‌ లెవల్‌లో ఉందన్న హీరో డైలాగ్‌తో టీజర్‌ పూర్తైంది. ఇది మరో రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ అని, ఇది కూడా ఉప్పెనంత విజయాన్ని సాధించాలని కోరుకుంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. శామ్‌దత్‌ సైనుద్దీన్‌ సినిమాటోగ్రాఫర్‌గా పని చేయగా దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement