వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల మాస్‌ ఎంటర్‌టైనర్‌ వచ్చేస్తోంది.. | Vaishnav Tej Sreeleela Action Entertainer Blocks Release Date | Sakshi
Sakshi News home page

వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల మాస్‌ ఎంటర్‌టైనర్‌ వచ్చేస్తోంది..

Published Tue, Jan 3 2023 8:53 AM | Last Updated on Tue, Jan 3 2023 9:01 AM

Vaishnav Tej Sreeleela Action Entertainer Blocks Release Date - Sakshi

‘ఉప్పెన’ ఫేమ్‌ పంజా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా ఓ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌పై ఎస్‌. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌ 29న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించి, వైష్ణవ్‌ తేజ్‌ వీడియోను రిలీజ్‌ చేసింది.

ఈ సందర్భంగా చిత్ర దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పూర్తి స్థాయి మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో వైష్ణవ్‌ సరికొత్త మాస్‌ అవతారంలో కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. టైటిల్‌తో పాటు, చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: డుడ్లే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement