
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఇటీవల కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసింది. విభిన్నమైన డ్రెస్సులతో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఫోటోలకు పోజులిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది ముద్దుగుమ్మ. అయితే ఈ ఫెస్టివల్‌లో ఊర్వశి తీరుపై విమర్శలొచ్చాయి. తన ఫోటో షూట్ కోసం మెట్లను బ్లాక్ చేశారంటూ సోషల్ మీడియాలో కొందరు ఆరోపించారు. కానీ అలాంటిదేం జరగలేదని.. తాను ముందే అనుమతి తీసుకున్నానని తెలిపింది ఊర్వశి రౌతేలా.
అంతేకాకుండా ఈ కాన్స్ ఫెస్టివల్‌కు హాజరైన ఐశ్వర్య రాయ్‌తో కొందరు పోల్చడంతో ఊర్వశి మరింత క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఐశ్వర్య ఫిల్మ్ ఫెస్టివల్ చివర్లో మాత్రమే కనిపించింది. కాన్స్‌లో గుర్తింపు పొందిన ఐశ్వర్యతో పోల్చడం ఎవరికైనా గౌరవప్రదమైన విషయం అయినప్పటికీ.. నెటిజన్స్ కామెంట్ చేయడంపై ఊర్వశి స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీస్‌లో క్లారిటీగా రాసుకొచ్చింది.
ఊర్వశి తన ఇన్‌స్టాలో రాస్తూ.. "నేను నా సొంత చరిష్మాతో ఐశ్వర్య రాయ్‌గా ఉండటానికి ప్రయత్నిస్తున్నా. ఎందుకంటే డార్లింగ్ ఐశ్వర్య ఓ ఐకానిక్. కానీ నేను మరొకరిలా నకిలీగా ఉండటానికి ఇక్కడికి రాలేదు. ఎందుకంటే నేను ఒక బ్లూ ప్రింట్. కాన్స్ ఫెస్టివల్‌లో ప్రత్యేకంగా నిలబడటానికే వచ్చా. నా లుక్, నా స్టైల్, నా విశ్వాసం మీకు అసౌకర్యంగా అనిపిస్తే గట్టిగా ఓ శ్వాస తీసుకోండి. నేను అందరికీ నచ్చే వ్యక్తిని కాదు. నేను ఎల్లప్పుడు బాణసంచా, షాంపైన్ లాగా ఉంటా. నాపై ఎన్ని విమర్శలొచ్చినా ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటా. ఎందుకంటే ఎవరూ మీలాగా చేయరు.' అని రాసుకొచ్చింది.
