క్రికెట్‌ నచ్చదంటూనే స్టేడియంలో ప్రత్యక్షమైన బాలీవుడ్‌ బ్యూటీ! | Sakshi
Sakshi News home page

Urvashi Rautela: క్రికెట్‌ చూడనన్నావ్‌, నచ్చదన్నావ్‌? మరి ఇదేంటి?

Published Mon, Aug 29 2022 12:06 PM

Urvashi Rautela Attends India Vs Pakistan Match - Sakshi

పాకిస్తాన్‌తో మ్యాచ్‌ అంటే చాలు.. క్రికెట్‌ లవర్స్‌ రోమాలు నిక్కబొడుస్తాయి. కప్పు కన్నా కూడా పాక్‌తో మ్యాచ్‌ గెలవడమే ముఖ్యం బిగిలూ అన్నట్లుగా ఉంటారు. అలాంటి మ్యాచ్‌ ఆదివారం దుబాయ్‌లో జరిగింది. ఆసియా కప్‌ టీ20 టోర్నీలో జరిగిన పాక్‌-భారత్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు లైగర్‌ హీరో విజయ్‌ దేవరకొండ స్టేడియంలో అడుగుపెట్టాడు. మరోపక్క క్రికెట్‌ అంటే పెద్దగా నచ్చదన్న బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలా సడన్‌గా క్రికెట్‌ స్టేడియంలో ప్రత్యక్షమైంది. ఈ మేరకు తనే ఓ ఫొటోను షేర్‌ చేస్తూ ఇండియా వర్సెస్‌ పాక్‌ అని రాసుకొచ్చింది.

ఇది చూసిన నెటిజన్లు.. 'అదేంటి? క్రికెట్‌ అంటే నచ్చదన్నావ్‌, అసలు చూడనన్నావ్‌ కదా!', 'ఇదిగో ఈ మహాతల్లి ఉన్నందుకే రిషభ్‌ పంత్‌ ఆడలేదు' అని కామెంట్లు చేస్తున్నారు. ఆమెను చూశాక పంత్‌ రియాక్షన్‌ ఇదే అంటూ పలు మీమ్స్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. కాగా ఊర్వశి ఇటీవల ఫ్యాన్స్‌తో జరిపిన చిట్‌చాట్‌లో నేను క్రికెట్‌ చూడను, కాబట్టి పెద్దగా క్రికెటర్లు ఎవరూ తెలీదు. కాకపోతే సచిన్‌, విరాట్‌ సర్‌ అంటే నాకెంతో గౌరవం అని రాసుకొచ్చిన విషయం తెలిసిందే!

ఇదిలా ఉంటే 2018లో ఊర్వశి, రిషభ్‌ పంత్‌ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపించారు. వీరు డేటింగ్‌ చేస్తున్నారంటూ కథనాలు కూడా వెలువడ్డాయి. కానీ అంతలోనే ఇద్దరూ వాట్సప్‌లో కూడా ఒకరినొకరిని బ్లాక్‌ చేసుకున్నారట. ఆ మరుసటి ఏడాదే రిషభ్‌ ఈ రూమర్లకు చెక్‌ పెడుతూ ఇషా నేగి అనే అమ్మాయిని తన గర్ల్‌ఫ్రెండ్‌గా ప్రకటించాడు. అయితే ఊర్వశి మాత్రం ఓ ఇంటర్వ్యూలో RP అనే వ్యక్తి తనకోసం గంటల తరబడి వేచి చూశాడంటూ కామెంట్లు చేసింది.

దీనిపై రిషభ్‌ పంత్‌ స్పందింస్తూ 'కొంతమంది పేరు కోసం అబద్ధాలు ఆడుతూ అవతలి వ్యక్తులను ఇబ్బందులో పడేస్తారు. ప్లీజ్‌ అక్క నన్ను వదిలెయ్‌' అంటూ పేరు ప్రస్తావించకుండానే కౌంటర్‌ ఇచ్చాడు. దీనికి ఊర్వశి నువ్వో పిల్ల బచ్చావి అని ఘాటుగా వ్యాఖ్యానించగా నీ ఆధీనంలో లేని విషయాల గురించి మరీ ఎక్కువ ఒత్తిడికి లోనవ్వద్దు అంటూ కౌంటర్లు వేశాడు పంత్‌.

చదవండి:  ప్రభుదేవా మైడియర్‌ భూతం ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!
మరోసారి పబ్లిక్‌గా నటితో ముద్దులాట.. అమ్మో అమ్మ చూస్తుందేమో!

Advertisement
 
Advertisement
 
Advertisement