Tejasswi Prakash: పబ్లిక్‌గా నటికి ముద్దులు.. అమ్మ చూస్తే ఏమంటుందోనంటున్న నటుడు

Karan Kundrra Reacts On His Viral Soft Kiss Video With Tejasswi Prakash - Sakshi

సోషల్‌ మీడియాలో తెగ హడావుడి చేస్తోంది తేజ్‌రాణ్‌ జోడీ. తేజ్‌రాణ్‌ అంటే ఎవరో మీకీపాటికే అర్థమైపోయుంటుంది. బుల్లితెర సెలబ్రిటీలు తేజస్వి ప్రకాశ్‌, కరణ్‌ కుంద్రా. ఎల్లప్పుడూ ఒకరి మీద ఒకరు ప్రేమాభిమానాలు చాటుకునే ఈ లవ్‌ బర్డ్స్‌ చుట్టూ ఉన్న జనాలను పట్టించుకోకుండా రొమాన్స్‌లో మునిగిపోతుంటారు ఒక్కోసారి. ఆ మధ్య పక్కన ఫ్రెండ్స్‌ ఉన్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయి ముద్దుల్లో మునిగిపోయారీ ప్రేమపక్షులు.

తాజాగా మరోసారి పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకుంటూ కనిపించారు. పైకి వెళ్లే ఎలివేటర్‌పై ఒకరు కిందకు వెళ్లే ఎలివేటర్‌పై మరొకరు నిల్చుకున్నారు. ఇద్దరూ కలిసే సమయానికి ముందుకు జరిగి ముద్దు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీని గురించి కరణ్‌, తేజస్విలను ప్రశ్నించగా నటి సిగ్గుతో తన ముఖాన్ని దాచేసుకుంది. అయితే కరణ్‌ మాత్రం.. అంతా బానే ఉంది కానీ మా పేరెంట్స్‌ ఈ వీడియో చూస్తే ఏమంటారో! అని సరదాగా స్పందించాడు.

చదవండి: మాజీ ప్రియుడితో నటి చక్కర్లు, వీడియో వైరల్‌
స్టేడియంలో సందడి చేసిన ‘లైగర్‌’

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top