మాజీ బాయ్‌ప్రెండ్‌తో సుష్మితా సేన్‌ షాపింగ్‌, వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

Sushmita Sen: మాజీ ప్రియుడితో నటి చక్కర్లు, వీడియో వైరల్‌

Published Sun, Aug 28 2022 9:15 PM

Sushmita Sen Shopping with Ex Boyfriend Rohman Shawl and Daughter Renee - Sakshi

మాజీ విశ్వసుందరి, బాలీవుడ్‌ నటి సుష్మితా సేన్‌ వృత్తిపరమైన విషయాలకంటే కూడా వ్యక్తిగత విషయాలతోనే తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌ మోదీతో లవ్‌లో పడ్డనాటి నుంచి సుష్మిత ప్రతి కదలిక మీద కన్నేసారు నెటిజన్లు. ఈ క్రమంలో పలుమార్లు తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ రోహ్మన్‌ షాతో షాపింగ్‌లు, సినిమాలకు వెళ్లడం చూసి ముక్కున వేలేసుకున్నారు. కొందరు మాత్రం బ్రేకప్‌ తర్వాత ఫ్రెండ్స్‌గా ఉండకూడదా? ఏంటని సుష్మితను సపోర్ట్‌ చేస్తున్నారు.

తాజాగా ఈ నటి తన కూతురు రినీ సేన్‌, మాజీ ప్రియుడు రోహ్మన్‌తో కలిసి షాపింగ్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా కెమెరా కంట పడ్డ ఈ బ్యూటీ రినీ, రోహ్మన్‌తో కలిసి ఫొటోలను పోజులిచ్చింది. కూతురు అలిషా బర్త్‌డే కోసం షాపింగ్‌ చేస్తున్నామని వెల్లడించింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు పలువిధాలుగా స్పందిస్తున్నారు. 'నువ్విలా నీ మాజీతో తిరుగుతుంటే అది చూసిన లలిత్‌ మోదీ ఏమైపోవాలి?', 'అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు'', 'అబ్బా.. వాళ్లిద్దరూ ఒకప్పుడు లవర్స్‌, ఇప్పుడు మంచి ఫ్రెండ్స్‌' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా సుష్మిత రినీ, అలిషా అనే ఇద్దరు కూతుళ్లను దత్తత తీసుకుని పెంచుకుంటోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె ఇటీవలే ఆర్య 2 వెబ్‌సిరీస్‌తో కమ్‌బ్యాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే!

చదవండి: టాలీవుడ్‌లో విషాదం, సీనియర్‌ హీరో కన్నుమూత
విజయ్‌కు తలపొగరు అన్నాడు, సారీ చెప్పాడు

Advertisement
 
Advertisement
 

తప్పక చదవండి

Advertisement