
కొన్ని ఫొటోల్లో ఊర్వశి మెడ మీద ఎర్రటి మరక కనిపించింది. ఇంకేముంది.. ఓ వెబ్‌సైట్ హద్దులు దాటి మరీ ఊర్వశి మెడపై లవ్ బైట్ అంటూ రాసేసింది. ఇది చూసిన నటికి చిర్రెత్తిపోయింది. హాస్యాస్పదంగా ఉంది! అది నా రెడ్ లిప్‌స్టిక్, మాస్క్ తీస్తూ పెడుతున్నప్పుడు అది నా మెడకు అంటింది.
Urvashi Rautela Angry Over Love Bite News: నటీనటులు కనిపిస్తే చాలు కెమెరాలు వారిని రౌండప్ చేస్తాయి. కళ్లకు కాటుక ఎక్కువైనా, డ్రెస్ కలర్ తక్కువైనా, శరీరం కొంత బొద్దుగైనా.. ఏదైనా సరే అన్నింటినీ కెమెరాల్లో బంధించేస్తాయి. అయితే ఇటీవల క్లిక్‌మనిపించిన కొన్ని ఫొటోల్లో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ఊర్వశి రౌతేలా మెడ మీద ఎర్రటి మరక కనిపించింది. ఇంకేముంది.. ఓ వెబ్‌సైట్ హద్దులు దాటి మరీ ఊర్వశి మెడపై లవ్ బైట్ అంటూ రాసేసింది. ఇది చూసిన నటికి చిర్రెత్తిపోయింది. సదరు కథనానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అగ్గిమీద గుగ్గిలమైంది.
'హాస్యాస్పదంగా ఉంది! అది నా రెడ్ లిప్‌స్టిక్, మాస్క్ తీస్తూ పెడుతున్నప్పుడు అది నా మెడకు అంటింది. పెదాలకు రెడ్ లిప్‌స్టిక్ పెట్టుకున్న తర్వాత దాన్ని మెయింటెన్ చేయడం ఎంత కష్టమో ఏ అమ్మాయిని అడిగినా చెప్తుంది. ఒకరి ప్రతిష్టను దిగజార్చడం కోసం ఏదిపడితే అది రాస్తారా? ఇలాంటి ఫేక్ న్యూస్‌లు రాసే బదులు నా విజయాల గురించి రాయొచ్చు కదా?' అని ట్వీట్ చేసింది. అంతేకాదు ఈ అసత్య ప్రచారం చేసినందుకుగానూ తనకు క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేసింది. కాగా ఊర్వశి 2013లో సింగ్ సాబ్ ద గ్రేట్ సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4, పాగల్ పంతి వంటి పలు చిత్రాల్లో నటించింది. ఆమె చివరగా వర్జిన్ భానుప్రియ సినిమాలో కనిపించింది.