Jr NTR To Released Vaishnav Tej Uppena Movie Official Trailer - Sakshi
Sakshi News home page

Uppena Movie Trailer: ఉప్పెన ట్రైలర్‌ వచ్చేసింది..

Feb 4 2021 4:30 PM | Updated on Feb 4 2021 6:39 PM

Uppena Movie Official Trailer Launched By Jr NTR - Sakshi

సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఉప్పెన‌. బుచ్చిబాబు సాన దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 12న విడుదల కానుంది. ఉప్పెనలో మంగ‌ళూరు బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్‌సేతుప‌తి నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమా ప్ర‌మోషన్స్‌లో రామ్‌​ చ‌ర‌ణ్‌, మ‌హేశ్ బాబు భాగ‌స్వామ్యం అవ్వగా తాజాగా మ‌రో స్టార్ హీరో ప్ర‌మోషన్స్‌లో ఎంటర్‌ అయ్యాడు. ఉప్పెన ట్రైలర్‌ను గురువారం సాయంత్రం ఎన్టీఆర్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో  ఉప్పెన ట్రైలర్‌ను రిలీజ్‌ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని, టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. చదవండి: ‘ఉప్పెన’ మరో సాంగ్‌.. ఆకట్టుకుంటున్న మెలోడీ

ఇక ట్రైలర్‌ విషయానికొస్తే.. ‘ప్రేమంటే ఓ లైలా-మజ్నులా, దేవదాసు-పార్వతిలా, రొమియో-జూలియట్‌లా అదో మాదిరిలా ఉండాలిరా’ అంటూ హీరో చెప్పే డైలాగ్‌తో మొదలవ్వగా.. ప్రేమ, ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో పడే కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. అలాగే ప్రతినాయకుడి పాత్రలో విజయ్‌ సేతుపతి చెప్పే డైలాగులు, పవర్‌ఫుల్‌ విలనిజం ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఇక దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో మరోసారి మ్యాజిక్ చేశాడని చెప్పవచ్చు. మొత్తంగా ప్రేమ, పరువు, కోపం, బాధ ఇలా అన్ని ఎమోషన్‌లను టచ్‌ చేసి చూపించారు. కాగా మైత్రీ మూవీ మేక‌ర్స్-సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాయి. దేవీ శ్రీ ప్ర‌సాద్ కంపోజ్ చేసిన పాట‌లు యూట్యూబ్‌లో మిలియ‌న్ల సంఖ్య‌లో వ్యూస్ సాధించి రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి స్పందన రావడంతో రిలీజ్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి: రిహన్నా ట్వీట్‌.. గూగుల్‌లో ఏం సెర్చ్‌ చేశారంటే?

Advertisement
 
Advertisement
Advertisement