ఈ వారం థియేటర్లలో సందడి చేసే సినిమాలు.. | Upcoming Movies Web Series Release Theatre OTT May 2nd Week | Sakshi
Sakshi News home page

This Week Theatre OTT Releases: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే..

May 16 2022 11:54 AM | Updated on May 16 2022 1:23 PM

Upcoming Movies Web Series Release Theatre OTT May 2nd Week - Sakshi

థియేటర్లలో పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 2 సినిమాలు చేసిన రచ్చను 'సర్కారు వారి పాట' కొనసాగిస్తోంది. ఇప్పటివరకు బాక్సాఫీస్‌ వద్ద పెద్ద సినిమాలు సందడి చేశాయి. ఈ క్రమంలో ఈ వారం ఏ సినిమాలు అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయా అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు.

Upcoming Movies Web Series Release Theatre OTT May 2nd Week: థియేటర్లలో పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 2 సినిమాలు చేసిన రచ్చను 'సర్కారు వారి పాట' కొనసాగిస్తోంది. ఇప్పటివరకు బాక్సాఫీస్‌ వద్ద పెద్ద సినిమాలు సందడి చేశాయి. ఈ క్రమంలో ఈ వారం ఏ సినిమాలు అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయా అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి మాత్రం పెద్ద సినిమాలు ఏవి థియేటర్లలో అడుగుపెట్టట్లేదు. చిన్న సినిమాలు మాత్రం ఈ వారం సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అవేంటో లుక్కేద్దామా !

1. శేఖర్‌
యాంగ్రీ ఎంగ్ మ్యాన్‌ రాజశేఖర్‌ చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం 'శేఖర్'. జీవితా రాజశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మే 20న థియేటర్లలో సందడి చేయనుంది. మలయాళంలో విజయం సాధించిన 'జోసేఫ్‌' సినిమాకు రీమేక్‌గా రానుంది. మనసున్న ప్రతి ఒక్కరికీ 'శేఖర్' నచ్చుతాడని, ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతారని డైరెక్టర్‌ జీవిత ఆదివారం ప్రెస్‌ మీట్‌లో తెలిపారు. 

2. ధగడ్ సాంబ
నవ్వులు పంచేందుకు రెడీ అయ్యాడు బర్నింగ్ స్టార్‌ సంపూర్ణేష్ బాబు. సంపూ, సోనాక్షి జంటగా నటించిన చిత్రం ధగడ్‌ సాంబ. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు ఎన్‌ఆర్‌ రెడ్డి డైరెక్టర్‌. 'సంపూర్ణేష్ బాబును ఇప్పటివరకు చూడని కొత్త పాత్రలో చూస్తారు. అసభ్యత లేకుండా కుటుంబమంతా కలిసి చూసేలా మూవీ ఉంది.' అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. 

3. ధాకడ్‌
బాలీవుడ్ బ్యూటీ, కాంట్రవర్సీ క్వీన్‌ కంగనా రనౌత్ ఏజెంట్‌ అగ్నిగా 'ధాకడ్' మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి రజనీష్‌ ఘయ్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ అయితే యాక్షన్‌ సీన్స్‌తో అదరిపోయింది. మరీ ఏజెంట్‌ అగ్నిగా కంగనా రనౌత్‌ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలంటే మే 20 వరకు ఆగాల్సిందే. 

4. భూల్‌ భులయా 2
హారర్‌, కామెడీ నేపథ్యంలో వస్తున్న హిందీ చిత్రం 'భూల్‌ భులయా 2'. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్‌ ఆర్యన్, బ్యూటీఫుల్‌ హీరోయిన్‌ కియరా అడ్వాణీ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అనీస్‌ బాజ్మీ డైరెక్షన్ చేశారు. టబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా మే 20న ప్రేక్షకులను భయంతో నవ్వించనుంది.  

ఓటీటీలో..
మే 20న ఓటీటీలో ఆర్ఆర్ఆర్, ఆచార్య, భళా తందనాన, 12th మ్యాన్, ఎస్కేప్‌ లైవ్, జాంబీవ్లీ చిత్రాలు, పంచాయత్‌ సీజన్ 2, నైట్ స్కై సీజన్ 1 వెబ్‌ సిరీస్‌లు విడుదల కానున్నాయి. 

1. ది ఇన్విజబుల్‌ మ్యాన్- మే 16 (నెట్‌ఫ్లిక్స్‌)
2. ది హంట్‌- మే 16 (నెట్‌ఫ్లిక్స్‌)
3. వూ కిల్డ్‌ సారా సీజన్‌ 3- మే 18 (నెట్‌ఫ్లిక్స్‌)
4. హనీమూన్‌- మే 20 (వూట్‌)

చదవండి: 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఫ్యాన్స్‌కు జీ5 షాక్‌.. సినిమాకు డబ్బులు చెల్లించాల్సిందే !
రెండో వివాహం చేసుకున్న స్టార్ మ్యూజిక్‌ డైరెక్టర్‌.. ఫొటోలు వైరల్‌

Advertisement
 
Advertisement
Advertisement