వారంలో ఓ డేట్‌ నైట్‌

Upasana shares tips to make relationships stronger - Sakshi

Upasana Valentines Day Tips: ‘‘ప్రేమలో పడటం సులభమే. కానీ ఎప్పుడూ ప్రేమతో కొనసాగడం ప్రేమికులుగా పార్క్‌లో నడిచినంత సులభం కాదు’’ అంటున్నారు రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన. సోమవారం వాలెంటెన్స్‌ డే సందర్భంగా తమ (రామ్‌చరణ్, ఉపాసన) వివాహం జరిగి పదేళ్లు పూర్తయ్యాయని, తమ సక్సెస్‌ఫుల్‌ అండ్‌ హ్యాపీ లైఫ్‌కి ఇవే కారణాలై ఉండొచ్చన్నట్లుగా ఉపాసన కొన్ని సలహాలు, సూచనలను ఓ వీడియో రూపంలో షేర్‌ చేశారు.

∙దాంపత్య జీవితంలో ఆరోగ్యానిదే అగ్రస్థానం. కాబట్టి ఇద్దరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉదయాన్నే నిద్రలేవడం వల్లే మన ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని నేను నమ్ముతాను. చాలామంది మ్యారేజ్‌ గోల్స్‌ను పెయిన్‌ఫుల్‌గా భావిస్తారు. కానీ ప్రేమతో చేస్తే అవే బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ∙ప్రతిరోజూ మన ప్రియమైన వారితో కాస్త సమయాన్ని గడిపేలా ప్లాన్‌ చేసుకోవాలి. కలిసి భోజనం చేయడం, కబుర్లు చెప్పుకోవడం, కలిసి సినిమాలు చూడటం.. ఇలాంటివి జీవితాన్ని మరింత ప్రేమతో నింపి మరింత అందంగా మారుస్తాయి.

అలాగే వారంలో ఓసారి డేట్‌ నైట్‌ను ప్లాన్‌ చేసుకోండి. మీ వివాహ బంధంలో ఏవైనా దూరాలు ఉంటే మళ్లీ కనెక్ట్‌ అవ్వండి. జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించండి. ∙పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు కానీ అది నిజం కాదని నా నమ్మకం. భూమి మీద ఓ ఇద్దరు చేసే ఎఫర్ట్స్‌పైనే వారి దాంపత్య జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ అంశాలతో పాటు మన జీవిత భాగస్వామిపట్ల అమితమైన ప్రేమ, గౌరవాన్ని కూడా కలిగి ఉండాలని మర్చిపోవద్దు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top