TV Actress Neha Marda Baby Shower Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Neha Madra: ఘనంగా చిన్నారి పెళ్లికూతురు నటి సీమంతం, ఫోటోలు వైరల్‌

Jan 30 2023 12:33 PM | Updated on Jan 30 2023 2:58 PM

TV Actress Neha Marda Baby Shower Photos Goes Viral - Sakshi

నేహా బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు)లో గెహనాగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. క్యో రిష్తా మే

బుల్లితెర నటి నేహా మాద్ర త్వరలో తల్లి కాబోతుంది. పెళ్లైన పదేళ్ల తర్వాత గర్భం దాల్చడంతో ఆమె ఇంట సంతోషాలు వెల్లివిరిశాయి. తాజాగా నటి సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను నేహా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ భావోద్వేగానికి లోనైంది. 'నా కడుపులో ఉన్న బిడ్డపై ఎనలేని ప్రేమ కురిపించారు. ఈ సీమంతం అంతా ఒక కలలా అనిపిస్తోంది. నా అనుభూతిని మాటల్లో చెప్పలేకపోతున్నాను' అని రాసుకొచ్చింది. ఈ ఫోటోల్లో దంపతులిద్దరూ లావెండర్‌ కలర్‌ దుస్తుల్లో మెరిసిపోయారు.

కాగా నేహా మాద్ర బిజినెస్‌మెన్‌ ఆయుష్మాన్‌ను 2012లో పెళ్లాడింది. గతేడాది నవంబర్‌ 24న తను గర్భం దాల్చిన విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా మెటర్నిటీ షూట్‌ చేసిన ఫోటోలను తన సోషల్‌ మీడియాలో ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఇకపోతే నేహా బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు)లో గెహనాగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. క్యో రిష్తా మే కత్తి బత్తి, డోలీ అర్మానోకీ వంటి సీరియల్స్‌లో నటించింది. అలాగే జలక్‌ దిక్‌లాజా డ్యాన్స్‌ షో 8వ సీజన్‌లోనూ పార్టిసిపేట్‌ చేసింది.

చదవండి: ఘనంగా హీరోయిన్‌ పూర్ణ సీమంతం

Advertisement
 
Advertisement
Advertisement