ఆమిర్‌ ఖాన్‌ కూతురు సిగరెట్‌ తాగుతుందా? | Trolls On Aamir Khan Daughter Ira Khan Over Her Cigarette Images | Sakshi
Sakshi News home page

Ira Khan: నువ్వు సిగరెట్‌ తాగుతావ్‌ కదూ! ఏ బ్రాండ్‌?

Jul 27 2021 6:33 PM | Updated on Jul 27 2021 6:56 PM

Trolls On Aamir Khan Daughter Ira Khan Over Her Cigarette Images - Sakshi

Aamir Khan’s Daughter Ira Khan: మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ కూతురు ఇరా ఖాన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముంది అంటారా? మరేం లేదు, ఇరా ఖాన్‌ తన కుక్కపిల్లను కాళ్ల మీద పడుకోబెట్టుకుని ఉంది. ఆమె పక్కనే ఓ వస్తువుంది, కానీ అది బ్లర్‌ అయి ఉంది. అయితే బ్లర్‌ చేసినప్పటికీ అదేంటో పసిగట్టారు నెటిజన్లు.

కచ్చితంగా అది సిగరెట్‌ బాక్స్‌ లేదా లైటర్‌ అయ్యుంటుందని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇరా ఖాన్‌ సిగరెట్‌ తరచూ తాగుతుందని, ఇంతకీ ఏ బ్రాండ్‌ సిగరెట్‌ తాగుతుందో? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అక్కడ సిగరెట్‌తో పాటు లైటర్‌ కూడా ఉందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే కొద్దిమంది మాత్రం ఆమె డ్రెస్సింగ్‌ స్టైల్‌ను కూడా విమర్శిస్తున్నారు. 'సెలబ్రిటీల పిల్లలు ఎందుకు సరిగా బట్టలు వేసుకోరు', 'ఆమె ప్యాంటు వేసుకోవడం మర్చిపోయినట్లుంది' అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement