త్రిషను ఆడేసుకుంటున్న నెటిజన్లు | Sakshi
Sakshi News home page

Trisha Krishnan: తన కులాన్ని ప్రస్తావించిన త్రిష, నెట్టింట ట్రోలింగ్‌

Published Sun, Jan 8 2023 9:07 PM

Trisha Krishnan Trolled For Mentioning Her Cast Name - Sakshi

నాలుగు పదుల వయసులోనూ అందంతో అలరిస్తోన్న హీరోయిన్స్‌లో త్రిష ఒకరు. ఇటీవలే పొన్నియన్‌ సెల్వన్‌లో కుందవై పాత్రతో ఆకట్టుకున్న ఆమె రాంగీ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలతో అదరగొట్టింది. ప్రస్తుతం ఆమె విజయ్‌ 67, అజిత్‌ 62వ చిత్రంలో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. కెరీర్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఏ ఫుడ్‌ ఇష్టమన్న ప్రశ్నకు సౌత్‌ ఇండియన్‌ హోమ్‌ ఫుడ్‌.. అందులోనూ బ్రాహ్మణుల ఇంటి భోజనం నాకెంతో ఇష్టం అని చెప్పింది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ఏ ఫుడ్‌ ఇష్టమన్న ప్రశ్నకు మధ్యలో కులాన్ని తీసుకురావడం అవసరమా?, నీ కులాన్ని నొక్కి చెప్పి బిల్డప్‌ ఇవ్వడమెందుకో? అని ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు. మరికొందరేమో తనకు అనిపించింది చెప్పడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. ప్రతిదానికీ సెలబ్రిటీలను విమర్శించడమే పనైపోయిందని తిట్టిపోస్తున్నారు త్రిష ఫ్యాన్స్‌.

చదవండి: కోపమొస్తే తల్లి అని కూడా చూడను, తిట్టేస్తా
ఎన్టీఆర్‌ కనుబొమ్మ కూడా నటిస్తుంది: రాజమౌళి

Advertisement
 
Advertisement
 
Advertisement