కొమురం భీముడో నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ సాంగ్‌: రాజమౌళి | SS Rajamouli: Komuram Bheemudo is My All Time Favourite Song | Sakshi
Sakshi News home page

SS Rajamouli: ఎన్టీఆర్‌ను ఆకాశానికెత్తిన జక్కన్న, వీడియో వైరల్‌

Jan 8 2023 6:07 PM | Updated on Jan 8 2023 6:39 PM

SS Rajamouli: Komuram Bheemudo is My All Time Favourite Song - Sakshi

కొమురం భీముడో పాట కానీ, ఆ సన్నివేశం కానీ ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ అని వెల్లడించాడు. ఈ పాటలో కెమెరాను జూమ్‌ చేసి తారక్‌ కనుబొమ్మ మీద పెట్టినా సరే ఆ కనుబొమ్మ కూడా పర్ఫామ్‌ చేస్తుంది. అంత గొప్ప నటుడు తారక్‌ అని ప్రశంసలు కురిపించాడు జక్కన్న. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా డీవీవీ

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. పాన్‌ ఇండియా లెవల్‌లో హిట్‌ అయిన ఈ సినిమాను ఎస్‌ఎస్‌ రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించాడు. ఇందులోని ప్రతి పాటా హిట్టే.. కొమురం భీముడో సాంగ్‌ అయితే మరింత స్పెషల్‌. సినిమాను మలుపు తిప్పే ఈ పాటలో తారక్‌ పర్ఫామెన్స్‌, ఆ మ్యూజిక్‌ వింటే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. ప్రేక్షకులకే కాదు తనకూ ఆ పాట ఫేవరెట్‌ అంటున్నాడు జక్కన్న.

శనివారం లాస్‌ ఏంజిల్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ స్క్రీనింగ్‌కు హాజరయ్యాడు రాజమౌళి, తారక్‌. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ తాను డైరెక్ట్‌ చేసిన చిత్రాల్లో కొమురం భీముడో పాట కానీ, ఆ సన్నివేశం కానీ ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ అని వెల్లడించాడు. ఈ పాటలో కెమెరాను జూమ్‌ చేసి తారక్‌ కనుబొమ్మ మీద పెట్టినా సరే ఆ కనుబొమ్మ కూడా పర్ఫామ్‌ చేస్తుంది.. అంత గొప్ప నటుడు తారక్‌ అని ప్రశంసలు కురిపించాడు జక్కన్న. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా గతేడాది బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలోనూ పలు అవార్డులు అందుకుంది.

చదవండి: చివరి నిమిషంలో చిరంజీవికి హ్యాండిచ్చిన శ్రుతిహాసన్‌
బెల్ట్‌ తీసి భయపెట్టిన శ్రీహాన్‌... చిన్మయి ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement