నిర్మాతతో డేటింగ్‌.. అఫీషియల్‌గా ప్రకటించిన నటి | Tripti Dimri make her relationship Insta official with Anushka Sharma's brother Karnesh Ssharma? See pic | Sakshi
Sakshi News home page

Tripti Dimri: నిర్మాతతో డేటింగ్‌.. అఫీషియల్‌గా ప్రకటించిన నటి

Dec 31 2022 9:36 PM | Updated on Dec 31 2022 9:37 PM

Tripti Dimri make her relationship Insta official with Anushka Sharma's brother Karnesh Ssharma? See pic - Sakshi

బాలీవుడ్ నటి తృప్రి డిమ్రీ డేటింగ్ విషయంలో స్పష్టత ఇచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా నటి అనుష్క శర్మ సోదరుడు, నిర్మాత కర్నేష్ శర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఇద్దరు ఉన్న ఫోటోను షేర్ చేస్తూ మై లవ్‌ అంటూ ఎమోజీలు జతచేసింది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఈ జంట సిద్ధమైనట్లు తెలుస్తోంది.

నటి తృప్తి డిమ్రీ నెట్‌ఫ్లిక్స్ ప్రసారమైన బుల్బుల్ (2020)లో నటించింది. ఈ చిత్రాన్ని కర్నేష్ తన బ్యానర్‌లో తెరకెక్కించారు. అప్పటి నుంచి డేటింగ్ ఊహాగానాలతో ఈ జంట వార్తల్లో నిలిచింది. అయితే వీరిద్దరూ తమ రిలేషన్ షిప్ గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నారా అని తృప్తిని ప్రశ్నించారు. ఇప్పుడే మా ప్రయాణం మొదలైది. ఇది మాత్రమే ఇప్పుడు చెప్పగలను. నా పెళ్లికి ఇంకా 7-8 సంవత్సరాలు పడుతుందని.' అని చెప్పుకొచ్చింది. తృప్తి ఇటీవలే కాలాలో నటించింది. ఈ చిత్రానికి అనుష్క నుంచి ప్రశంసలు అందుకుంది నటి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement