'యానిమల్' బ్యూటీ కొత్త బాయ్‌ఫ్రెండ్.. అలా తెలిసిపోయింది! | Tripti Dimri Rumoured Boyfriend Sam Merchant Special Wishes On Her Birthday, Pic Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Tripti Dimri Boy Friend: బిజినెస్‌మ్యాన్‌తో 'యానిమల్' హీరోయిన్ ప్రేమలో ఉందా?

Published Fri, Feb 23 2024 5:27 PM

Tripti Dimri Boyfriend Sam Merchant Wishes On Her Birthday - Sakshi

'యానిమల్' సినిమాలో ఒక్కొక్కరికి ఒక్కో విషయం నచ్చింది. కొందరికి రణ్‌బీర్ యాక్టింగ్ నచ్చితే మరికొందరికి యాక్షన్ సీన్స్ నచ్చాయి. మిగతా చాలామందికి మాత్రం జోయ పాత్ర చేసిన నటి తెగ నచ్చేసింది. దీంతో ఆమె ఎవరా అని ఆరా తీసి, ఆమె గురించి తెలుసుకుని మొత్తానికి తృప్తిని ఫేమస్ చేసి పడేశారు. దీంతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. ఇప్పుడు ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ గురించి బయటపడింది.

(ఇదీ చదవండి: ప్రేమ కావాలంటున్న మెగా డాటర్ నిహారిక.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్)

తృప్తి దిమ్రి చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంది. 2017లో మామ్, పోస్టర్ బాయ్స్ చిత్రాల్లో నటించింది. బుల్ బుల్, కాలా తదితర చిత్రాల్లో బాగా చేసిందని పేరయితే తెచ్చుకుంది గానీ గుర్తింపు రాలేదు. కానీ 'యానిమల్' మూవీతో రాత్రికి రాత్రి ఈమె ఫేట్ మారిపోయింది. కుర్రాళ్లకు పాన్ ఇండియా క్రష్ అయిపోయింది. గతంలో ఈమె.. అనుష్క శర్మ తమ్ముడు కర్నేశ్ శర్మతో రిలేషన్ ఉందని అన్నారు గానీ కొన్నాళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయినట్లు కూడా మాట్లాడుకున్నారు.

ప్రస్తుతానికైతే 'యానిమల్' బ్యూటీ తృప్తి సింగిల్‌గానే ఉందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ ఈమెకు ఆల్రెడీ ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని టాక్. సామ్ మర్చంట్ అనే యంగ్ బిజినెస్‌మ్యాన్.. తాజాగా తృప్తి పుట్టినరోజు సందర్భంగా 'హ్యాపీ బర్త్ డే డియరెస్ట్ తృప్తి' అని ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందనే టాక్ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఒకవేళ సీక్రెట్ రిలేషన్‌షిప్ లాంటిది ఏమైనా ఉంటే త్వరలోనే ఓ క్లారిటీ వచ్చేయొచ్చని కూడా మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?)

Advertisement
 
Advertisement
 
Advertisement