సుధీర్ బాబు వీడియో లీక్.. మీరస్సలు ఊహించి ఉండరు..!

Tollywood Young Hero Sudheer babu Makeover Video Leaked - Sakshi

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ఇటీవల హంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అయితే  ఆ చిత్రం బాక్సాపీస్ వద్ద పెద్ద ఆకట్టుకోలేకపోయింది. తాజాగా మరో చిత్రంతో అభిమానులను అలరించేందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఆయన హర్షవర్ధన్ డైరెక్షన్‌లో మామ మశ్చీంద్ర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియోలో తెగ వైరలవుతోంది. 

మామ మశ్చీంద్ర మూవీలో సుధీర్ బాబు మేక్ ఓవర్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో లీకైంది. అందులో హీరో పూర్తి భిన్నమైన లుక్‌లో కనిపించారు. అది చూసిన ఆయన అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ఆ వీడియోలో సుధీర్ బాబు బాడీ లాంగ్వేజ్ చాలా మారిపోయింది. అసలు ఆ వీడియోలో ఉన్నది అతనేనా అన్న అనుమానం కలుగుతోంది. సుధీర్ బాబు, హర్షవర్ధన్ కాంబినేషన్‌లో మామా మశ్చీంద్ర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ పతాకంపై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top