
అనికా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'బుట్టబొమ్మ'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ అప్ డేట్ వచ్చేసింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ ‘బుట్టబొమ్మ’ టీజర్ రిలీజ్ చేసింది.
గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథను తలపిస్తోంది. టీజర్‌లో పలు సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. పల్లెటూరి ప్రేమకథ, కొన్ని యాక్షన్ సన్నివేశాలు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. ఈ చిత్రానికి శౌరి చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి గోపి సుందర్ సంగీతమందిస్తుండగా.. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.