యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా బిగ్‌బ్రదర్‌.. రిలీజ్‌ ఎప్పుడంటే? | Sakshi
Sakshi News home page

Big Brother Movie: యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా బిగ్‌బ్రదర్‌.. రిలీజ్‌ ఎప్పుడంటే?

Published Mon, May 20 2024 2:53 PM

Tollywood Movie Big Brother Pre Release Event In Hyderabad

శివ కంఠంనేని,  ప్రియా హెగ్డే ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం బిగ్‌ బ్రదర్‌. గోసంగి సుబ్బారావు దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందించారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె.శివశంకర్ రావు, ఆర్.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రి-రిలీజ్ వేడుక నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మురళీమోహన్, అశోక్ కుమార్, నిర్మాతల మండలి అధ్యక్షులు దామోదర్ ప్రసాద్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు పాల్గొన్నారు.

తెలుగులో పలు చిత్రాలు రూపొందించిన సుబ్బారావు.. భోజపురిలోనూ సినిమాలు తెరకెక్కించారు.బిగ్ బ్రదర్ మూవీతో హీరో శివ కంఠంనేని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మురళీమోహన్ పేర్కొన్నారు. చిన్న సినిమాల విజయమే చిత్ర పరిశ్రమకు శ్రీరామరక్ష అని దామోదర్ ప్రసాద్, అశోక్ కుమార్ అన్నారు. ఈ సినిమాలో శివ మరింత గుర్తింపు పొందాలని.. బింబిసార చిత్రానికి ఫైట్స్ డిజైన్ చేసిన రామకృష్ణ రూపొందించిన పోరాటాలు ప్రత్యేక ఆకర్షణ అని ప్రభు పేర్కొన్నారు.

ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేయడం గర్వంగా ఉందని హీరో శివ కంఠంనేని అన్నారు. యాక్షన్ ఎంటర్టైనర్‌ను ఇష్టపడేవారిని బిగ్ బ్రదర్ చక్కగా అలరిస్తుందన్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల విశ్వ కార్తికేయ, గుండు సుదర్శన్, రాజేంద్ర సంతోషం వ్యక్తం చేశారు. అనుకోకుండా భోజపురి పరిశ్రమకు వెళ్లి 15 సినిమాలు చేశానని చిత్ర దర్శకులు గోసంగి సుబ్బారావు అన్నారు. చాలా రోజుల తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుండడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని..ఇకపై వరసగా తెలుగులో పాన్ ఇండియా సినిమాలు చేస్తానని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో శ్రీ సూర్య, ప్రీతి శుక్లా, గుండు సుదర్శన్, రాజేంద్ర తదితరులు నటించారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement