'గాడిద గుడ్డేం కాదు'.. నెటిజన్‌కు ఇచ్చిపడేసిన విశ్వక్‌ సేన్‌! | Tollywood Hero Vishwak Sen Reply To Netizen About His Latest Movie Rights, Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

Vishwak Sen: ''టీ షాప్ ముచ్చట్లు పెట్టొద్దు'.. నెటిజన్‌కు గడ్డిపెట్టిన మాస్‌ కా దాస్!

Published Wed, Jun 12 2024 10:13 PM | Last Updated on Thu, Jun 13 2024 12:25 PM

Tollywood Hero Vishwak sen Reply To Netizen about His Latest Movie Post

టాలీవుడ్ యంగ్ విశ్వక్ సేన్ ఇటీవలే గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి చిత్రంలో అలరించాడు. ఇటీవల థియేటర్లలో రిలీజైన బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. జూన్‌ 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

అయితే విశ్వక్‌ సేన్‌ ప్రస్తుతం మెకానిక్ రాకీ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీని ఉద్దేశించి ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేసింది. ఈ మూవీ రైట్స్‌ను దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం రూ.8 కోట్లకే అమ్మినట్లు పోస్ట్ చేసింది. అది కూడా జీఎస్టీతో కలిపి అంటూ పోస్ట్ పెట్టింది. ‍అయితే ఇది చూసిన విశ్వక్‌ సేన్‌ తనదైన శైలిలో నెటిజన్‌కు ఇచ్చిపడేశాడు.

'గాడిద గుడ్డేం కాదు.. టీ షాపు ముచ్చట్లు తీసుకొచ్చి ట్విటర్‌లో పెట్టొద్దు. మెకానికి రాకీ చిత్రానికి సంబంధించిన ఇంకా ఎలాంటి విక్రయాలు జరగలేదు. మీరు కాస్తా వాస్తవాలను తెలుసుకోండి. ఇదంతా ఓ టీమ్‌ కెరీర్‌కు సంబంధించింది' అంటూ నెటిజన్‌కు అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement