
మాస్ మహారాజా రవితేజ- హరీశ్ శంకర్ కాంబోలో వస్తోన్న యాక్షన్ చిత్రం 'మిస్టర్ బచ్చన్'. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నెల 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడతుండడంతో చిత్రబృందం ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.
తాజాగా మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కర్నూలులో గ్రాండ్‌గా నిర్వహించారు. నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగిన ఈవెంట్‌లో డైరెక్టర్‌తో పాటు చిత్రయూనిట్ సభ్యులంతా హాజరయ్యారు. అయితే ఈవెంట్ మధ్యలో రవితేజ మాట్లాడుతుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఓ అభిమాని ఒక్కసారిగా స్టేజీపైకి దూసుకొచ్చాడు. దీంతో రవితేజ అతన్ని ఆగు ఆగు గట్టిగా అరుస్తూ.. అభిమాని వద్దకు వెళ్లి అలా రాకూడదని అతనికి సూచించాడు. ఇలా వచ్చి మమ్మల్ని భయపెట్టకండ్రా బాబు.. అలా టప్పున వచ్చేస్తే మే భయపడతాం అంటూ రవితేజ నవ్వుతూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Orai Ila Tappana Rakandra Babu Bayapadtham 😂😂🔥🔥🔥🔥#RaviTeja #MrBachchan pic.twitter.com/XBBfgSBlCe
— Srinivas (@Srinivasrtfan2) August 12, 2024