
టాలీవుడ్ సినీ కార్మికులు 16వ రోజు కూడా సమ్మెలో పాల్గొన్నారు. తమ వేతనాలు పెంచాలంటూ ఇందిరానగర్‌లో పెద్దఎత్తున నిరసన తెలుపుతున్నారు. సినీ కార్మికుల ఐక్యవేదిక పేరుతో 24 క్రాఫ్ట్స్‌కు సంబంధించిన కార్మికులు నిరసనకు పిలుపునిచ్చారు. ఇప్పటికే తమ వేతనాల పెంపు అంశాన్ని ఫెడరేషన్ నాయకులు చిరంజీవికి వివరించారు. ఈరోజు సాయింత్రం జరిగే ఫిలిం ఛాంబర్, కార్మికుల ఫెడరేషన్ చర్చలతో సమ్మె సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 16వ రోజు సమ్మెతో టాలీవుడ్ ఇప్పటికే స్తంభించింది. షూటింగ్స్ లేక సగటు కార్మికులు ఆవేదన చెందుతున్నారు.
ఈ సమావేశం అనంతరం నేడు మరోసారి ఫెడరేషన్ నాయకులతో పాటు నిర్మాతలు కూడా చిరంజీవిని కలవనున్నారు. నిర్మాతలు పెట్టిన మొత్తం నాలుగు కండిషన్స్‌లలో రెండు కండిషన్స్ దగ్గర మాత్రమే పేచీ ఏర్పడింది. కార్మికులకు ఫ్లెక్సిబుల్ కాల్షీట్స్.. ఆపై రెండో ఆదివారం, ప్రభుత్వ సెలవు రోజుల్లో మాత్రమే డబుల్ పేమెంట్ వంటి అంశాలను కార్మిక సంఘాలు వ్యతిరేఖిస్తున్నాయి.
