
టాలీవుడ్ (Tollywood)లో ఫ్యాన్ వార్స్ ఎప్పుడూ ఉండేవే! మా హీరో తోపు, తురుము అని కొందరు.. మా హీరో గ్రేటెహె.. ఆయన కొట్టిన రికార్డులు మీ హీరోకెక్కడివి? అని మరికొందరు ఆయా కథానాయకులను వెక్కిరించడం, హేళన చేయడం వంటివి చూస్తూనే ఉన్నాం. ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ తీసుకుని ఎన్నో ఏళ్ల నుంచి వైరం ఉన్నట్లు దూషించుకుంటూనే ఉంటారు. అయితే ఆశ్చర్యంగా తెలుగు హీరోల అభిమానులంతా ఒక్కటయ్యారు.
ఒక్క ఘటనతో దర్శన్‌పై నెగెటివిటీ
ఎప్పుడూ గొడవపడే వీళ్లు ఈసారి వార్ ఆపేసి కలిసిపోయారు. అంతా కలిసి వేరే ఇండస్ట్రీకి చెందిన హీరో అభిమానులతో గొడవకు దిగారు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారు? శాండల్‌వుడ్ స్టార్ దర్శన్ (Darshan). ప్రియురాలిపై నీచమైన కామెంట్లు చేశాడని అభిమానినే హత్య చేసి జైలుకు వెళ్లొచ్చాడు కన్నడ హీరో దర్శన్. ఈ హత్య కేసు వల్ల దర్శన్‌పై విపరీతమైన నెగెటివిటీ వచ్చింది. కానీ, అతడి అభిమానులు మాత్రం అప్పటికీ, ఇప్పటికీ దర్శన్‌ను వెనకేసుకొస్తూనే ఉన్నారు.
ఈ ఎలివేషన్స్ అవసరమా?
తనేం చేసినా ఒప్పని చెప్తున్నారు. దర్శన్ మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అవుతుండటంతో కొందరు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అది చూసిన తెలుగువారు.. మర్డర్ చేసిన వ్యక్తికి ఎందుకీ ఎలివేషన్స్? ఇంకా ఆయన్ని ఎలా ఆరాధిస్తున్నారు? అంటూ విమర్శించారు. అది దర్శన్ అభిమానులకు అస్సలు నచ్చలేదు. అంతే, తెలుగు హీరోలను టార్గెట్ చేస్తూ ఇక్కడి అభిమానులపై బూతులతో చెలరేగిపోయారు.
ఏకమైన టాలీవుడ్
మనవాళ్లు ఊరుకుంటారా? నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందాం.. అన్నట్లుగా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. కాసేపు టాలీవుడ్ ఫ్యాన్ వార్స్ పక్కనపెట్టి అంతా ఏకమై దర్శన్‌ను, అతడి అభిమానులను ఏకిపారేస్తున్నారు. #KFIcriminalDarshan అంటూ రకరకాల హ్యాష్‌ట్యాగ్‌లతో నేషనల్ లెవల్‌లో ఈ గొడవను హైలైట్ చేస్తున్నారు.
Picha kottudu kodutunnaru ga 👌🔥#KFIcriminalDarshan pic.twitter.com/6ZTtw4XXHf
— Saha Devudu 🪐 (@SahaDevudu_) July 6, 2025
Just repost #KFIcriminalDarshan
7k tweets speed penchandi
pic.twitter.com/lxcg6Eyhy2— KALION⚰️🧡❤️🔥🛐 (@Rushinaidu11) July 6, 2025
Can I get 500 Retweets and 200 comments with #KFIcriminalDarshan tag 😎
TFI yuvatha possible aah ???? #KFIcriminalDarshanpic.twitter.com/dCQ1mIbivE— Rebal Relangi (@RebalRelang) July 6, 2025
చదవండి: కోలీవుడ్ స్టార్ విజయ్‌ను చూసి మన తెలుగు హీరోలు నేర్చుకోవాలి