Tollywood Rebel Star Krishnam Raju Passes Away - Sakshi
Sakshi News home page

Krishnam Raju Death: రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు కన్నుమూత

Sep 11 2022 6:36 AM | Updated on Sep 11 2022 10:36 AM

Tollywood Actor Krishnam Raju passed Away - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెబల్‌స్టార్‌  కృష్ణం రాజు(83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు.

187 చిత్రాల్లో నటించారు. 1966లో వచ్చిన చిలకా గోరింకా సినిమాతో టాలీవుడ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. చివరిసారి రాధేశ్యామ్‌లో నటించారు. ఈ సినిమాలో పరమహంస పాత్రలో నటించారు. వాజ్‌పేయి హయాంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు.

మహాప్రస్థానంలో అంత్యక్రియలు
ఆదివారం మధ్యాహ్నం భౌతిక కాయాన్ని కృష్ణంరాజు నివాసానికి తరలించనున్నారు. సోమవారం ఉదయం ఫిలింఛాంబర్‌కు అభిమానుల సందర్శనార్థం తీసుకొస్తారు. అధికారిక లాంఛనాలతో అంత్య​క్రియలు నిర్వహించనున్నారు. ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. మధ్యాహ్నం తర్వాత కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement