
కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘లోపలికి రా చెప్తా’. కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటించడమే కాకుండా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. మాస్ బంక్ మూవీస్ పతాకంపై లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మించిన ఈ కామెడీ హారర్ మూవీ జులై 5న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి 'టిక్ టాక్ చేద్దామా..'అనే పాటను టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ జాండ్ కంపోజ్ చేసిన ఈ పాట యూత్‌ని ఆకట్టుకునేలా ఉంది. రీసెంట్ గా ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన "లోపలికి రా చెప్తా" ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. అలాగే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు కూడా ఆకట్టుకుంటున్నాయి. హారర్ కామెడీ జానర్ లో ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందనే నమ్మకం ఉందని చిత్ర బృందం పేర్కొంది.