Heropanti 2 Movie: టైగర్‌ ష్రాఫ్‌ యాక్షన్‌ సీన్స్‌ కోసం ఖరీదైన కార్లు !

Tiger Shroff Shares Heropanti 2 New Look - Sakshi

Tiger Shroff Shares Heropanti 2 New Look: బాలీవుడ్ యాక్షన్‌ హీరోగా జాకీ ష్రాఫ్‌ కుమారుడు టైగర్‌ ష్రాఫ్‌ పేరుపొందాడు. 'హీరోపంటి' సినిమాతో బాలీవుడ్‌లో తెరంగ్రేటం చేసిన ఈ యంగ్‌ యాక్షన్‌ హీరో బాఘీ, బాఘీ 2, బాఘీ 3, వార్‌ చిత్రాలతో అలరించాడు. మరోసారి తన యాక్షన్‌ విన్యాసాలతో అబ్బురపరిచేందుకు రెడీ అవుతున్నాడు. టైగర్‌ తొలి చిత్రమైన హీరోపంటి సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న హీరోపంటి 2 కోసం బాగానే కష్టపడుతున్నాడు. ఈ మూవీ డైరెక్టర్‌ అహ్మద్‌ ఖాన్ భారీ యాక్షన సీక్వెన్స్‌ను రూపొందించే పనిలో ఉన్నాడని సమాచారం. 

అయితే ఈ సినిమాలోని ఓ భారీ పోరాట సన్నివేశం కేసం అత్యంత విలాసవంతమైన కార్లను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఈద్‌ కానుకగా ఈ ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్‌. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక పోస్టర్‌ను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశాడు టైగర్‌ ష్రాఫ్‌. 'హీరోపంటి స్థాయిని ఈ షెడ్యూల్‌ రెట్టింపు  చేసింది. అత్యంత ఛాలెంజింగ్‌ సీక్వెన్స్‌లలో ఒకదాని కోసం షూటింగ్‌ చేస్తున్నాం. దాని గ్లింప్స్‌ షేర్‌ చేసుకునేందుకు వేచి ఉండలేను.' అని టైగర్‌ క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మిస్తుండగా తారా సుతారియా హీరోయిన్‌గా నటిస్తోంది. 

అయితే టైగర్‌ పోస్ట్‌కు 'వేచి ఉండలేను' అని కామెంట్‌ చేసింది బీటౌన్ ముద్దుగుమ్మ దిశా పటాని. టైగర్ ష్రాఫ్‌, దిశా రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు  కొడుతున్న సంగతి తెలిసిందే.   
 

ఇదీ చదవండి: సినిమా షూటింగ్‌లో టైగర్‌ ష్రాఫ్‌కు గాయం.. ఫొటో షేర్‌ చేసిన నటుడు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top