ప్రేమజంటపై కేసు: మండిపడ్డ హీరో తల్లి!

Tiger Shroff Mother Ayesha Shroff Defends Him And Disha Patani After Police Case - Sakshi

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ బుధవారం ముంబై వీధుల్లో ప్రయాణించిన బాలీవుడ్‌ ప్రేమజంట టైగర్‌ ష్రాఫ్‌, దిశా పటానీలకు ముంబై పోలీసులు షాకిచ్చిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ నిబంధనలకు నీళ్లొదులుతూ రోడ్ల మీద షికారుకొచ్చిన సెలబ్రిటీల మీద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సరైన కారణం లేకుండానే వారు బయటకు వచ్చారని తెలిపారు.

దీంతో కరోనా టైంలో షికారేంటని ఈ జంట మీద కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తుండగా దాన్ని తీవ్రంగా ఖండించింది టైగర్‌ తల్లి ఆయేషా. "మీరు తప్పుగా అనుకుంటున్నారు. టైగర్‌, దిషా ఇంటికి కారులో తిరిగొస్తుండగా వారిని పోలీసులు అడ్డుకుని ఆధార్‌ కార్డులు చూపించమని అడిగారు. అయినా ఈ సమయంలో ఎవరూ అలా బయట చక్కర్లు కొట్టడానికి వెళ్లరు. ఏదైనా మాట్లాడేముందు నిజానిజాలు తెలుసుకోండి" అని మండిపడింది.

'టైగర్‌ ష్రాఫ్‌.. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు ఉచిత భోజనం అందించినదాని గురించి ఎవరూ మాట్లాడరు కానీ అతడి ప్రతిష్టను దిగజార్చేందుకు మాత్రం సిద్ధంగా ఉంటారు. అయినా అత్యవసరమైన వాటి కోసం బయటకు వెళ్లేందుకు అనుమతి ఉందన్న విషయం గుర్తుంచుకోండి' అని ఆయేషా చెప్పుకొచ్చింది.

చదవండి: దిశా మాజీ ప్రియుడి​ ఫొటోలు​.. సల్మాన్ 2 రూపాయల ఆర్టిస్ట్​!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top