Tiger 3 Director Maneesh Sharma Says That The Film Will Be Well Worth The Wait - Sakshi
Sakshi News home page

ముప్పై కోట్ల ఫైట్‌

May 6 2023 4:10 AM | Updated on May 6 2023 9:11 AM

Tiger 3 director Maneesh Sharma says that the film will be well worth the wait - Sakshi

‘ఏక్తా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ చిత్రాల తర్వాత ‘టైగర్‌’ ఫ్రాంచైజీలో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘టైగర్‌ 3’. ‘ఏక్తా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ చిత్రాల్లో హీరో, హీరోయిన్లుగా నటించిన సల్మాన్‌ ఖాన్, కత్రినా కైఫ్‌లు ‘టైగర్‌ 3’లోనూ జంటగా నటిస్తున్నారు. యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు మనీష్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ పతాకంపై ఆదిత్యా చో్ప్రాఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం కోసం ఈ నెల 8 నుంచి ముంబైలో ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను ప్లాన్‌ చేసింది యూనిట్‌. ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌లో షారుక్‌ ఖాన్‌ గెస్ట్‌గా కనిపిస్తారు. ఈ ఒక్క ఫైట్‌ కోసమే నిర్మాత ఆదిత్యా చో్ప్రాదాదాపు రూ. 30 కోట్లు కేటాయించారని, జైలు బ్యాక్‌డ్రాప్‌లో ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉంటుందని బాలీవుడ్‌ టాక్‌. ‘టైగర్‌ 3’ సినిమాను ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement