Acharya Ticket Prices: ఆచార్య సినిమా టికెట్ ధరల పెంపు

'ఆచార్య' సినిమా ఐదో షోకు వారం రోజుల పాటు అనుమతి
టికెట్ల పెంపునకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన చిత్రం ఆచార్య. సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆచార్య టికెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈనెల 29 నుంచి మే 5వరకు టికెట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం ఒక్కో టికెట్‌పై మల్టీప్లెక్స్‌లో రూ. 50, సాధారణ థియేటర్స్‌లో రూ. 30 పెంచుకునేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా ఆచార్య ఐదో ఆట ప్రదర్శనకు వారం రోజుల పాటు అనుమతి కల్పించింది.