Tholiprema Heroine Keerthi Reddy Shares Her Latest Pics on Instagram - Sakshi
Sakshi News home page

Keerthi Reddy: సుమంత్‌తో విడాకుల అనంతరం నటనకు బ్రేక్‌ ఇచ్చిన కీర్తి రెడ్డి, ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

Feb 7 2023 6:02 PM | Updated on Feb 7 2023 6:47 PM

Tholiprema Heroine Keerthi Reddy Shares Her Latest Pic on Instagram - Sakshi

హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్‌లో మైలురాయిగా చెప్పుకోద‌గ్గ చిత్రాల్లో తొలిప్రేమ ఒక‌టి. తొంభై ద‌శ‌కంలో ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్ట‌ర్. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను యూత్‌కి బాగా క‌నెక్ట్ చేసింది ఈ చిత్రం. అమాయ‌క‌మైన ప్రేమికుడిగా, ప్రియురాలికి త‌న ప్రేమ విష‌యం చెప్పేందుకు తాప‌త్ర‌య‌ప‌డే యువ‌కుడి పాత్ర‌లో ప‌వ‌న్ న‌ట‌న అంద‌రినీ క‌ట్టిప‌డేసింది. హీరోయిన్‌గా కీర్తి రెడ్డి చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. అందం, అభినయంతో కుర్రకారును ఆకట్టుకున్న కీర్తి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ ఎదిగింది.

నటిగా రాణిస్తున్న క్రమంలో సడెన్‌గా ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉంది, ఏం చేస్తుందనేది పెద్దగా ఎవరికి తెలియదు. అయితే తొలిప్రేమ సినిమా వచ్చి దాదాపు 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా కీర్తి రెడ్డి గురించి సినీ ప్రియులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంతో ఆమెకు సంబంధించిన లేటెస్ట్‌ ఫొటోలు, ఆసక్తికర విషయాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తొలిప్రేమ తర్వాత తెలుగు, హిందీ, తమిళ్‌లో పలు చిత్రాలు చేసిన కీర్తి అక్కినేని హీరో సుమంత్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.  అయితే వారి దాంపత్య జీవితం ఎక్కువ కాలం నిలవలేదు.

పెళ్లి చేసుకున్న ఏడాదికే విడాకులు తీసుకుని సుమంత్‌తో విడిపోయింది. ఆ తర్వాత కీర్తి సినిమాలకు దూరమైంది. పెళ్లి తర్వాత ఆమెకు అవకాశాలు రాకపోవడంతో పూర్తిగా నటనకు గుడ్‌బై చెప్పింది. అనంతరం ఓ ఎన్‌ఆర్‌ఐని రెండో పెళ్లి చేసుకున్న కీర్తి ప్రస్తుతం భర్తతో కలిసి ఆమెరికాలో స్థిరపడింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం హౌజ్‌ వైఫ్‌గా లైఫ్‌ లీడ్‌ చేస్తున్న కీర్తి ఇటీవల ఇండియాలో జరిగిన బంధువుల ఫంక్షన్‌లో మెరిసింది.

ఈ వేడుకలో సమంత స్నేహితురాలు, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ శిల్పారెడ్డితో కలిసి దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీంతో కీర్తిరెడ్డి లేటెస్ట్‌ ఫొటో బయటకు వచ్చింది. ఇప్పటికే కీర్తి అలాగే ఉందని, పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లైన కీర్తి అందం ఏమాత్రం తరగలేదంటూ ఆమె ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. అంతేకాదు మళ్లి సినిమాల్లో నటించొచ్చు కదా అంటూ అభిమానులు తమ కోరిక బయటపెడుతున్నారు. 

చదవండి: 
పెళ్లి చేసుకున్న ‘నేనింతే’ హీరోయిన్‌, వరుడు ఎవరంటే!
ఓర్వలేక నా బిజినెస్‌పై కుట్ర చేస్తు‍న్నారు: కిరాక్‌ ఆర్పీ

Advertisement
 
Advertisement
Advertisement