S Thaman Shares Meme On Prabhas Radhe Shyam To Counter Trollers - Sakshi
Sakshi News home page

S Thaman: రాధేశ్యామ్‌ ట్రోలింగ్‌పై తమన్‌ కౌంటర్‌, స్లోగా ఉందా; పరిగెత్తాల్సింది!

Mar 11 2022 8:45 PM | Updated on Mar 12 2022 8:21 AM

Thaman Shares Meme On Radhe Shyam To Counter Trollers - Sakshi

'సినిమా ఎలా ఉంది?' అన్న ప్రశ్నకు బాగా స్లోగా ఉందని చెప్పగా.. 'నేను అడిగింది బాగుందా? బాలేదా? అని!, లవ్‌ స్టోరీ స్లోగా కాకుండా ఫస్ట్‌ హాఫ్‌లో ఫస్ట్‌ నైట్‌, సెకండాఫ్‌లో సెకండ్‌ సెటప్‌ పెట్టాలా ఏంటి?' అని చిర్రుబుర్రులాడుతున్నట్లుగా ఉంది.

ప్రభాస్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాధేశ్యామ్‌ ఎట్టకేలకు శుక్రవారం (మార్చి 11) రిలీజైంది. రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన ఈ పీరియాడికల్‌ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ ప్రేమకథ అజరామరం అని కొందరు పొగుడుతుంటే మరికొందరు మాత్రం చాలా స్లోగా సాగుతూ బోర్‌ కొట్టిందని అంటున్నారు. ఈ సినిమా ప్రభాస్‌ చేయాల్సింది కాదని కొందరు నెగెటివ్‌ కామెంట్లు పెడుతుంటారు. తాజాగా ఈ నెగెటివిటీపై సంగీత దర్శకుడు తమన్‌ పరోక్షంగా స్పందించాడు.

చదవండి: ‘రాధేశ్యామ్‌’మూవీ రివ్యూ

సినిమా స్లోగా ఉందన్నవాళ్లకు కౌంటరిచ్చేలా ఉన్న మీమ్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఇంతకీ ఆ మీమ్‌లో ఏముందంటే.. 'సినిమా ఎలా ఉంది?' అన్న ప్రశ్నకు బాగా స్లోగా ఉందని చెప్పగా.. 'నేను అడిగింది బాగుందా? బాలేదా? అని!, లవ్‌ స్టోరీ స్లోగా కాకుండా ఫస్ట్‌ హాఫ్‌లో ఫస్ట్‌ నైట్‌, సెకండాఫ్‌లో సెకండ్‌ సెటప్‌ పెట్టాలా ఏంటి?' అని చిర్రుబుర్రులాడుతున్నట్లుగా ఉంది. దీన్ని షేర్‌ చేసిన తమన్‌.. 'మీమ్‌ అదిరింది.. స్లో అంట, నువ్వు పరిగెత్తాల్సింది' అంటూ ట్రోలర్స్‌పై సెటైర్‌ వేశాడు. ఈ ట్వీట్‌కు బ్లాక్‌బస్టర్‌ రాధేశ్యామ్‌ అన్న హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశాడు. మరి ఈ సినిమా నిజంగానే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందో లేదో చూడాలి!

Advertisement
 
Advertisement
Advertisement