Telugu Film Producers Council: సంక్రాంతికి ఆ సినిమాలకే అధిక ప్రాధాన్యత.. నిర్మాతల మండలి సంచలన నిర్ణయం

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎగ్జిబిటర్లకు లేఖ రాసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ సినిమాల ప్రదర్శనకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని లేఖలో వెల్లడించింది. 2017లో జరిగిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అత్యవసర మీటింగ్‌లో ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సంక్రాంతి, దసరా పండుగలకు తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని లేఖలో స్పష్టం చేసింది.
ఈ విషయంపై ఫిల్మ్ చాంబర్ ఉపాధ్యక్షుడు దిల్‌రాజు 2019లో ఇదే అంశాన్ని ప్రస్తావించారని గుర్తు చేసింది. టాలీవుడ్ చిత్రాలు ఉండగా.. డబ్బింగ్ చిత్రాలకు ఎలా ప్రాధాన్యత ఇస్తారని గతంలో దిల్ రాజు ప్రశ్నించారు. అందువల్లే ఈ నిర్ణయాన్ని ఎగ్జిబిటర్లు తప్పకుండా పాటించాలని లేఖలో వివరించింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమను కాపాడుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతల మండలి లేఖలో ప్రస్తావించింది. సంక్రాతి, దసరా పండుగల సమయంలో తెలుగు సినిమాలకు మొదటి ప్రాధ్యానత ఇస్తూ మిగిలిన థియేటర్లను మాత్రమే డబ్బింగ్ సినిమాలకు కేటాయించాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సినిమా ఎగ్జిబిటర్స్‌ను కోరింది.
Telugu Film Producers Council Press Note.#TFPC #PRESSNOTE pic.twitter.com/uu9oqqc0uc
— Telugu Film Producers Council (@tfpcin) November 13, 2022