
తెలంగాణలో హైకోర్టులో పవన్ కల్యాణ్ ‘ఓజీ’ చిత్రాకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో టికెట్ల పెంపుకు అంగీకరించేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నెల 24న ఓజీ మూవీ టికెట్ ధరల పెంపు మొమోని హైకోర్టు సింగిల్ జడ్జి సస్పెండ్ చేసిని సంగతి తెలిసిందే. దీనిపై ఈ రోజు హైకోర్టులో వాదనలు జరిగాయి.
‘ఓజీ’ యూనిట్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. రివ్యూ పిటిషన్‌పై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. తదుపరి విచారణను అక్టోబరు 9వ తేదీకి వాయిదా వేసింది. టికెట్ ధరలు ఎందుకు పెంచాలనుకుంటున్నారో తెలియజేస్తూ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది.
కాగా, తెలంగాణలో ఓజీ సినిమా టికెట్ల పెంపుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 24న రాత్రి వేసిన ప్రీమియర్ టికెట్ ధరను రూ. 800గా నిర్ణయించారు. అక్టోబరు 4వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు న్యాయస్థానం ఆదేశాలతో వాటిని తగ్గించాల్సి ఉంటుంది.
