భరణినికి గట్టిగానే హెచ్చరిక.. కెప్టెన్సీ కోసం కల్యాణ్‌, పవన్‌ల మోసం | Bigg Boss Telugu 9: Nagarjuna Exposes Kalyan-Pavan Cheating, Warns Bharani, Immanuel Wins Power Astra | Sakshi
Sakshi News home page

భరణినికి గట్టిగానే హెచ్చరిక.. కెప్టెన్సీ కోసం కల్యాణ్‌, పవన్‌ల మోసం

Oct 12 2025 9:44 AM | Updated on Oct 12 2025 11:51 AM

Telangana girl sruthi strong warning to bharani game in bigg boss

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రణరంగంలానే ఉంది. గతంలోకంటే ఎక్కువ టాస్క్‌లు పెడుతూ బిగ్‌బాస్‌ జోరు పెంచాడు. తాజాగా శనివారం ఎపిసోడ్ నాగార్జున ఎంట్రీతో మరింత హీట్‌ పెరిగింది.  ఈ వారంలో భరణి చేసిన తప్పులతో పాటు రితూ, పవన్‌లను కూడా నాగ్‌ ఎండగట్టారు. తనూజాకు ఒక వీడియో చూపించి అసలు విషయం తెలుసుకోవాలంటూ సూచన ఇచ్చారు. ఇకనైన గేమ్‌ మీద ఏకాగ్రత పెట్టాలని నాగ్‌ సలహా ఇచ్చారు.

ఈ వారం ఉత్తమ ప్రదర్శనతో ఇమ్మాన్యుయేల్ మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. గోల్డెన్ స్టార్‌ల మనసు కూడా గెలుచుకున్నాడు. దీంతో పవర్ అస్త్ర పోటీలో కూడా ఇమ్మూ తనదైన ముద్రవేశాడు. తనూజ,దివ్య రాము, కళ్యాణ్,భరణిలతో కలిసి పవర్‌ అస్త్ర పోటీలో ఇమ్మూ ఉన్నారు.  ఈ టాస్క్‌లో పవర్‌ అస్త్రను అతను గెలుచుకున్నాడు.

భరణిని గట్టిగానే హెచ్చిరించిన తెలంగాణ అమ్మాయి
తెలంగాణ అమ్మాయి శ్రుతి ప్రస్తుతం యూకేలో ఉంటుంది. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఆమె ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చొంది. ఈ క్రమంలోనే షో గురించి మాట్లాడాలని ఆమెకు నాగార్జున మైక్‌ ఇచ్చారు. తనకు  ఫేవరేట్ ఇమ్మానుయేల్ అని చెప్పిన ఆమె భరణి  ఆట మాత్రం నచ్చదని  సూటిగానే చెప్పేసింది. ఇదే విషయాన్ని భరణితోనే డైరెక్ట్‌గానే అనేసింది. మీ ఆట మార్చుకోండి లేదంటే బిగ్‌బాస్‌లో మేము ఉంచమని పేర్కొంది. బంధాలు పెట్టుకున్నవాళ్లతోనే ఎక్కువగా క్లోజ్‌గా ఉంటున్నారని చెప్పింది. బంధాలు పెట్టుకోని వాళ్లను మాత్రం కిందకు తోసేస్తున్నారని తెలిపింది. ఈ క్రమంలోనే శ్రీజాని కూడా తోసేశారని చెప్పింది. అది ఎంతమాత్రం ఆడియన్స్‌కు నచ్చలేదని క్లారిటీ ఇచ్చింది.

పవన్‌, కల్యాణ్‌ల మోసం
బిగ్‌బాస్‌లో చాలామందిని మెప్పించిన కంటెస్టెంట్‌ తనూజ.. ఈ వారంలో ఆమె ఆట బాగున్నప్పటికీ బంధాల విషయంలో కాస్త ఇబ్బంది పడిందని చెప్పాలి.  ఈ క్రమంలోనే నాగార్జున ఆమెను  కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి  మాట్లాడారు. కెప్టెన్‌గా కల్యాణ్‌ గెలిచాడు కదా అందుకు సబంధించిన వీడియో ఒకటి చూడాలని ప్లే చేస్తాడు.  అందులో కల్యాణ్‌ గెలుపు కోసం డెమాన్ పవన్ తన షూస్‌తో చేసిన పనిని వీడియోలో నాగ్ చూపించారు. ఈ వీడియోలో ఏం గమనించావ్‌ అని తనూజని నాగ్ కోరుతారు. అతను (పవన్‌) కాలితో ఎటు వైపు లైట్ వెలిగిందో కళ్యాణ్‌కి చూపిస్తున్నట్లు ఉందన్ని తనూజ చెబుతుంది. దాంతో నాగార్జున అసలు విషయం చెప్తాడు. నాన్నా నాన్నా అంటూ  బంధం పెంచుకున్న భరణి  లైట్ ఆఫ్ చేశాడని  డెమాన్ పవన్ క్లియర్‌గా కళ్యాణ్‌కి అలా తన లెగ్‌తో చూపించాడని క్లారిటీ ఇస్తాడు. కళ్యాణ్ కూడా దీని ఆధారంగానే సమాధానం చెప్పాడని నాగ్‌ అంటారు. కానీ, ఈ విషయం నీతో  ఎవరూ చెప్పలేదని క్లారిటీ ఇస్తారు. ఇకనైనా సరే జాగ్రత్తగా ఆట ఆడాలని తనూజను నాగ్‌ కోరుతారు.

ఆటలోనే కాదు వ్యక్తిత్వంలో కూడా కిందపడిపోయిన భరణి
కొన్ని గేమ్స్‌లలో భరణి ఆడిన తీరు మెచ్చి నాగార్జున గోల్డెన్ స్టార్ ఇస్తారు. దానిని దివ్య చేతుల మీదుగా తీసుకుంటానని ఆయన కోరతాడు. దీంతో తనూజలో కనిపించని బాధను వ్యక్తం చేస్తుంది. దివ్య ఎంట్రీ తర్వాత భరణి కూడా తనూజకు కాస్త దూరంగానే ఉంటున్నారు.  ఈ క్రమంలోనే బెడ్‌ టాస్క్‌ గురించి నాగార్జున మాట్లాడుతారు.  శ్రీజాని అలా తోసేయడం కరెక్ట్‌ అనిపించిందా భరణి అని నాగ్‌ అడుగుతారు. డెమాన్‌ పవన్‌ కంటే ముందే నువ్వు బెడ్‌ నుంచి పడిపోయావ్‌ కదా అని నాగ్‌ వీడియోతో చూపిస్తాడు. 

దీంతో చేసేది ఏం లేక స్వార్ధంగా ఆలోచించాను సార్‌ అని తప్పును ఒప్పు​కుంటాడు. దీంతో నాగార్జున కూడా చురకలు అంటిస్తాడు. ‘ఎంతో ఎదగాల్సిన నువ్వు పడ్డది బెడ్ పై నుంచి కాదు.. మా దృష్టిలో నుంచి కూడా కిందికి పడ్డావ్ అంటారు. మహాభారతంలో ధర్మరాజు ఎన్ని తప్పులు చేస్తున్నాడో నువ్వు కూడా అన్ని చేస్తున్నావ్ అంటూ క్లాస్‌ తీసుకున్నారు. ఆటలో ముందుకు వెళ్లాల్సిన శ్రీజాను కిందకు తోసేశావ్‌.  నీవల్ల ఆమె ఆటే ఆగిపోయింది. కేవలం పొరపాటు వల్లే జరిగింది. అని భరిణిపై గట్టిగానే నాగ్‌ హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement