Happy Birthday Varalakshmi Sarathkumar: Team Yashoda Releases Special Poster On Her Birthday - Sakshi
Sakshi News home page

Yashoda Birthday Special: సమంత సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్ర

Mar 5 2022 3:18 PM | Updated on Mar 5 2022 6:41 PM

Team Yashoda Releases Special Poster On Varalakshmi Sarathkumar Birthday - Sakshi

వరలక్ష్మీ శరత్‌కుమార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళంతో పాటు తెలుగులోనూ అదరగొడుతుంది. ఇటీవలె క్రాక్‌, నాంది సినిమాలతో హిట్‌ అందుకున్న ఆమెకు తెలుగులో మరింత క్రేజ్‌ పెరిగింది. తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న యశోద సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. శనివారం ఆమె పుట్టినరోజు కావడంతో యశోద టీం ఆమెకు బెస్ట్‌ విషెస్‌ తెలియజేస్తూ ఆ చిత్రం నుంచి స్పెషల్‌ పోస్టర్‌ వదిలారు.

ఈ చిత్రంలో ఆమె 'మధుబాల' అనే పాత్రలో కనిపించనున్నట్లు పోస్టర్‌లో స్పష్టమవుతుంది.  ఈ సినిమాకు హరీశ్‌ శంకర్‌, హరీశ్‌ నారాయన్‌ దర్శకత్వం వహిస్తుండగా శ్రీదేవీ మూవీ బ్యానర్‌పై శివలంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఉన్ని ముకుందన్‌ మరో ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement