అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్‌కు ఉహించని ప్రశ్న! | Tanya Ravichandran Faces Critical Question On Interview From Fan, See How Actress Reacted | Sakshi
Sakshi News home page

అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. హీరోయిన్‌కు ఊహించని ప్రశ్న!

May 10 2024 8:00 AM | Updated on May 10 2024 11:21 AM

Tanya Ravichandran Faces Critical Question On Interview From Fan

ఒక్కోసారి హీరోయిన్లకు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా అభిమానుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు ఏం చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితి ఉంటుంది. తాజాగా నటి తాన్యా రవిచంద్రన్‌కు అలాంటి పరిస్థితే ఎదురైంది. ప్రఖ్యాత నటుడు రవిచంద్రన్‌ మనవరాలైన తాన్యా రవిచంద్రన్..‌ ఆయన వారసత్వాన్ని తీసుకుని సినీ రంగప్రవేశం చేశారు. 

ఆమె 2017లో భలే వెళైదేవా అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమయ్యారు. శశికుమార్‌ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ తాన్నా రవిచంద్రన్‌కు  అవకాశాలు తలుపు తడుతూనే ఉన్నాయి. అలా బృందావనం, కరుప్పన్, నెంజుక్కు నీతి, మాయోన్, అకిలన్‌ వంటి చిత్రాల్లో నటించి తనకుంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

తాజాగా ఆమె రసవాది అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా తాన్యా రవిచంద్రన్‌ ఓ భేటీలో అభిమానులతో ముచ్చటించారు. వారితో తన చిత్రాల గురించి.. తాను నటించాలనుకుంటున్న పాత్రల గురించి వివరించారు. అదే సమయంలో తనకు ఎదురైన విచిత్రమైన ప్రశ్న గురించి చెప్పారు. ఒకసారి అభిమాని ఒకరు అనూహ్యంగా అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగారన్నారు. అతను అడిగిన విధానం తనకు అర్థం కాలేదన్నారు. అక్కా అన్నాడు.. పెళ్లి చేసుకుంటావా? అని సంబంధమే లేకుండా అడిగిన అతని ప్రశ్నకు బదులేం చెప్పాల్లో తనకు అర్థం కాలేదన్నారు. ఇలాంటి ఫన్నీ సంఘటనలు గుర్తొస్తే నవ్వొస్తుందని తాన్యా రవిచంద్రన్‌ పేర్కొన్నారు. కాగా రసవాది చిత్రం తనకు మంచి పేరు తెచ్చి పెడుతుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement