తంగలాన్‌ నాకో కొత్త అనుభవం | Sakshi
Sakshi News home page

తంగలాన్‌ నాకో కొత్త అనుభవం

Published Thu, Nov 2 2023 4:08 AM

Tangalan Teaser Movie Launch by Vikram - Sakshi

‘‘నేను విదేశాలు వెళ్లినప్పుడు మీరు బాలీవుడ్డా అని అడుగుతుంటారు. నేను కోలీవుడ్, టాలీవుడ్‌ అని చెబుతుంటాను. అంటే... వారు ఎక్కువగా హిందీ చిత్రాలే చూసేవారు. కొన్నేళ్లుగా సౌత్‌ సినిమాలు చూస్తున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీఎఫ్‌’..లాంటి సినిమాలు పెద్ద విజయాలు సాధించాయి. దక్షిణాది సినిమాలు ఇప్పుడు ఓ మార్క్‌ని క్రియేట్‌ చేస్తున్నాయి. రాజమౌళిగారు ఆస్కార్‌ను మనకు తీసుకొచ్చారు. ఆయనతో ఓ సినిమా చేయాలని ఉంది’’ అన్నారు విక్రమ్‌.

కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో రూపొందిన పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘తంగలాన్‌’. విక్రమ్‌ హీరోగా పా. రంజిత్‌ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. పా. రంజిత్‌ నీలమ్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు. పార్వతీ, మాళవికా మోహనన్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా జనవరి 26న రిలీజ్‌ కానుంది. బుధవారం జరిగిన ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో విక్రమ్‌ మాట్లాడుతూ– ‘‘తంగలాన్‌’ ఎమోషనల్‌ అండ్‌ రా ఫిల్మ్‌.

రెగ్యులర్‌ సాంగ్స్, ఫైట్స్‌.. ఇలాంటి తరహా సినీ గ్లామర్‌ ‘తంగలాన్‌’లో లేదు. నా పాత్రకు డైలాగ్స్‌ అంతగా ఉండవు. లైవ్‌ సౌండింగ్‌లో సినిమా చేశాం. నాకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌. మేకప్‌కు మూడు గంటలు పట్టేది. మీనింగ్‌ఫుల్‌ సినిమాలు చేస్తుంటారు పా. రంజిత్‌గారు. ‘తంగలాన్‌’తో ప్రేక్షకులు ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. ఇక నేను చేసిన ‘9 నెలలు’ చిత్రానికి సురేందర్‌రెడ్డి, వినయ్‌లు అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌గా చేశారు. ఇప్పుడు సురేందర్‌ రెడ్డి ఈ ఈవెంట్‌కు వచ్చారు.

లైఫ్‌ సర్కిల్‌లా అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘విక్రమ్‌గారితో నేను చేసిన తొలి చిత్రమిది. ఆయన అంకితభావం, టైమింగ్‌ సూపర్‌. ‘తంగలాన్‌’ సినిమా ప్రేక్షకులను మెప్పి స్తుంది’’ అన్నారు పా. రంజిత్‌. ‘‘విక్రమ్‌ ట్రెమండస్‌ యాక్టర్‌. వరల్డ్‌ సినిమా లవర్స్‌కు ‘తంగలాన్‌’ ఓ గ్రేట్‌ ట్రీట్‌లా ఉంటుంది’’ అన్నారు కేఈ జ్ఞానవేల్‌ రాజా. ‘‘విక్రమ్‌ సార్‌ ఓ నటుడుగా తనను తానే మళ్లీ ఆవిష్కరించుకుంటుంటారు’’ అని అతిథిగా పాల్గొన్న సత్యదేవ్‌ అన్నారు. దర్శకులు వేణు ఊడుగుల, కరుణకుమార్, దర్శక–నిర్మాత మధుర శ్రీధర్‌ అతిథులుగా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement