Tammareddy Bharadwaja: ఆదిపురుష్‌ టీజర్‌పై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్‌ కామెంట్స్‌

Tammareddy Bharadwaja Respond On Adipurush Teaser Trolls - Sakshi

గత కొద్ది రోజులుగా ఆదిపురుష్‌ టీజర్‌పై ట్రోల్స్‌ వస్తున్న సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియా మొత్తం ఆదిపురుష్‌ ట్రోల్స్‌, మీమ్స్‌తో నిండిపోయయి. యానిమేటెడ్‌ చిత్రంలా ఉందని, రావణుడు, హనుమంతుడి పాత్రలు ఇలా ఉన్నాయేంటంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే దీనిపై మూవీ టీం స్పందిస్తూ ఇది 3డీ చిత్రమని, థియేటర్లో  చూస్తేను ఈ మూవీని ఎక్స్‌పీరియన్స్‌ చేయగలుగుతారని దర్శకుడు ఓంరౌత్‌ వివరణ ఇచ్చాడు. ఈ క్రమంలో రీసెంట్‌గా మూవీ ట్రైలర్‌ను థియేటర్లో విడుదల చేసింది చిత్ర బృందం. అంతేకాదు 20 రోజుల్లో మరో టీజర్‌ కూడా విడుదల చేస్తామని చెప్పారు. అయితే తాజాగా ఆదిపురుష్‌ టీజర్, ట్రైలర్‌పై దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.

చదవండి: ధనుష్‌-ఐశ్వర్యలు మళ్లీ కలవబోతున్నారా? ఇదిగో క్లారిటీ..

తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా ఆదిపురుష్‌ టీజర్‌పై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.  ‘‘ఆదిపురుష్‌ ట్రైలర్‌ చూశాను. ప్రభాస్‌ సినిమా అనేసరికి అందరిలో చాలా వేడిగా వాడిగా ఉంటుంది. రూ. 500 కోట్ల బడ్జెట్‌తో బాలీవుడ్‌ తెరకెక్కించిన ఈ చిత్రంపై ఫుల్‌ హైప్‌ క్రియేట్‌ క్రియేట్‌ అయ్యింది. కానీ ఈ మూవీ నిరాశ పరిచింది. యానిమేటెడ్‌ చిత్రంలా ఉంది. ఓ యానిమేటెట్‌ చిత్రాన్ని పెద్ద సినిమా ఎలా అంటారో నాకు అర్థం కావడం లేదు. 3డీలో థియేటర్లో ఎక్స్‌పీరియస్‌ వేరు ఉంటుందని మూవీ టీం చెప్పింది. నాకు తెలిసినంతవరు 3డీలో చేసిన, 4డీ చేసిన 2డీ చేసినా యానిమేషన్‌కి, లైవ్‌కి చాలా తేడా ఉంటుంది. ఈ మూవీని రజనీకాంత్‌ రజినీకాంత్‌ తీసిన కొచ్చాడియన్‌లా యానిమేటెడ్‌ చిత్రంలా తీశారని అందరు ట్రోల్‌ చేస్తున్నారు.

చదవండి: ఆ వార్తలు మాకు చిరాకు కలిగించాయి : మీడియాపై చిరు అసహనం

3డీలో చూసే సరికి మీ అభిప్రాయం మారుతుందంటున్నారు. కానీ 2డీ నుంచి 3డీకి వెళ్లినంత మాత్రాన వారి గేటప్‌లు, కాస్ట్యూమ్స్‌ మారవు కదా. పూర్తిగా యానిమేటెడ్‌ ప్రభాస్‌ను చూసినట్టుంది. రాముడు, రావణాసురుడు, హనుమంతుడు గెటప్‌ల మీద కూడా చాలా ట్రోలింగ్‌ నడిచింది. రాముడిని దేవడిగా కొలిచే దేశంలో ఆయన గెటప్‌ని మార్చేయడం విచిత్రంగా ఉంది. రావణాసురుడు కూడా బ్రాహ్మణుడు. ఆయనకు కూడా దేవాలయాలు ఉన్నాయి. 20 రోజుల్లో అంతా మారిపోతుంది అంటున్నారు. నిజంగా ఆ రిపేర్లు ఏవో చక్కగా చేస్తే మంచిదే. సినిమా మంచిగా రావాలనే ట్రోల్స్‌ చేస్తున్నారు. సినిమాని అల్లరి చేయాలని చేయడం లేదు. ఆదిపురుష్‌ సినిమాకి ఆల్‌ ది బెస్ట్‌” అంటూ తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top