GodFather Success Meet: Chiranjeevi Fire On Media - Sakshi
Sakshi News home page

GodFather: ఆ వార్తలు మాకు చిరాకు కలిగించాయి : మీడియాపై చిరు అసహనం

Oct 9 2022 1:24 PM | Updated on Oct 9 2022 2:26 PM

GodFather Success Meet: Chiranjeevi Fire On Media - Sakshi

ఒక సినిమాను ఎప్పుడు ప్రమోట్‌ చేయాలి? ఏ సినిమాను ఎక్కడ హైప్‌ చేయాలి? అనే విషయాలు దర్శకనిర్మాతలకు తెలియదా? మేం ఏం చేయాలో కూడా మీరే( మీడియా) నిర్ణయిస్తే ఎలా? అని మీడియాపై మెగాస్టార్‌ చిరంజీవి అసహనం వ్యక్తం చేశారు. గాడ్‌ఫాదర్‌ భారీ విజయం సాధించడంతో శనివారం చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో సక్సెస్‌ మీట్‌ని ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘గాడ్‌ఫాదర్‌’ని ఒరిజినల్‌ లూసిఫర్‌ కంటే బెటర్‌గా చేశాం. మా టీమంతా చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఆ సమయంలో మీడియాలో వచ్చే కొన్ని వార్తలు మాకు చిరాకు కలిగించాయి. సినిమాను సరిగా ప్రమోట్‌ చేయడం లేదని, హైప్‌ లేదని వార్తలు రాశారు.  మేం ఏం చేయాలో కూడా మీరే నిర్ణయిస్తే ఎలా? అని చిరంజీవి ప్రశ్నించారు.  

(చదవండి: అలాంటివాడిని కూడా ఇంటికి ఆహ్వానించాడు..అది చిరంజీవి సంస్కారం)

‘గాడ్ ఫాదర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వర్షం పడినప్పటికీ  నేను స్పీచ్‌ ఇచ్చాను. ఒకవేళ నేను మాట్లాడకపోతే మీడియా మరోలా వార్తలు రాసి కంపు చేసేదనే భయంతో  ఆ రోజు స్పీచ్‌ ఇచ్చాను. కానీ అదే మీడియా.. ఈ సినిమా బాగుందనే టాక్‌ వచ్చిన తర్వాత గాడ్‌ఫాదర్‌ గురించి అత్యద్భుతంగా రాసి మమల్ని ఎంకరేజ్‌ చేసింది. ఈ సినిమా ఇంత హిట్‌ అవ్వడానికి, ప్రతి ఒక్కరు ఈ చిత్రం గురించి మాట్లాడుకునేలా చేసిన మీడియాకు కృతజ్ఞతలు’అని చిరంజీవి అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement