ఈ సినిమా చూశాక కన్నీళ్లు ఆపుకోలేకపోయా: తమ్మారెడ్డి భరద్వాజ | Tammareddy Bharadwaj Comments On Music Shop Murthy Movie In Success Meet, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Tammareddy Bharadwaj: ఈ సినిమా చూశాక కన్నీళ్లు ఆపుకోలేకపోయా

Jul 29 2024 5:02 PM | Updated on Jul 29 2024 5:31 PM

Tammareddy Bharadwaj Comments On Music Shop Murthy

కొత్త కథలు, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇప్పుడు ఆడియెన్స్‌‌ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ ఉన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. అలాంటి ఓ డిఫరెంట్ కంటెంట్‌తో వచ్చిన సినిమానే మ్యూజిక్ షాప్ మూర్తి.. ఇప్పటికే థియేటర్‌ ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా తాజాగా ఓటీటీలో కూడా సందడి చేస్తుంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది.

అజయ్ ఘోష్, చాందినీ చౌదరిలు ప్రముఖ పాత్రల్లో నటించిన ఈ సినిమాను థియేటర్లో  చూసిన ప్రతీ ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. బరువెక్కిన గుండెతో థియేటర్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓటీటీలో విడుదలైన సందర్భంగా చిత్ర యూనిట్‌ మీడియా ప్రతినిధుల సమక్షంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో దర్శకనిర్మాతలతో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది.

ఈ సందర్భంగా నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. 'ప్రతి మనిషి జీవితంలో జరిగే కథనే ఇది. ఎన్నో కష్టాలు దాటుకొని వచ్చిన తర్వాతే విజయం వరిస్తుంది. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు పేరు పేరునా కృతజ్ఞతలు. ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ ఎంతో కో-ఆపరేటివ్ గా పని చేశారు. ఓ ఫ్యామిలీలా అందరం కలిసి ఈ సినిమాను రూపొందించాం. నన్ను తెలుగు తెరపై చూపించిన మొదటి దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు ఈ సినిమా చూసి నాకు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. ఈ సినిమా కథను నమ్మి డబ్బు పెట్టిన నిర్మాతలకు సెల్యూట్. శివ సినిమాను బాగా రూపొందించారు. ఈ సినిమాలోని చాలా సీన్స్ నా నిజ జీవితంలో జరిగినవే.' అని ఆయన  అన్నారు.

ముఖ్య అతిధిగా వచ్చిన దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..  ఈ సినిమా ట్రైలర్ చూశాక ఈ అజయ్ ఘోష్‌ని పెట్టి సినిమా తీసుకున్నారు. వీళ్ళ పని అయిపోనట్లే అనుకున్నా. కానీ, సినిమా చూశాక మతిపోయింది. చివరలో అయితే ఈ సినిమా సీన్స్ చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయా. ఈ సినిమాను చాలా డిఫరెంట్‌గా  రూపొందించారు. కష్టాలు, కన్నీళ్లు కాదు మంచితనంతో కొట్టారు. సినిమా సక్సెస్ అయింది కానీ ఈ సినిమాతో వీళ్లకు డబ్బులు వచ్చాయని అయితే నేను నమ్మను. మంచి సినిమాను ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమాలకు మీడియా వాళ్ల సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది.' అని తమ్మారెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement