లోకేశ్‌తో సినిమా చేసిన హీరో.. ఇప్పుడిలా అయిపోయాడేంటి? | Tamil Actor Sri Goes Unrecognizable, Fans Worried | Sakshi
Sakshi News home page

బక్కచిక్కిన యంగ్‌ హీరో.. అసభ్య వీడియోలు.. మానసిక స్థితి బాలేదా?

Apr 13 2025 4:19 PM | Updated on Apr 13 2025 4:27 PM

Tamil Actor Sri Goes Unrecognizable, Fans Worried

తమిళ హీరో శ్రీ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. శ్రీ అసలు పేరు శ్రీరామ్‌ నటరాజన్‌ (Sriram Natarajan). ఫస్ట్‌ సీరియల్‌లో నటించాడు. తర్వాత బాలాజీ శక్తివేల్‌ దర్శకత్వం వహించిన వళక్కు ఎన్‌ 18/9 సినిమాతో హీరోగా మారాడు. ఈ మూవీ ఘన విజయం సాధించింది. తమిళంలో బెస్ట్‌ ఫీచర్‌ ఫిలింగా జాతీయ అవార్డు అందుకుంది. తొలి సినిమాతోనే శ్రీ పెద్ద హిట్‌ అందుకున్నాడు.

ఇలా అయిపోయాడేంటి?
తర్వాత ఒనాయుమ్‌ ఆటకుట్టియుమ్‌, సోన్‌ పాపిడి, విల్‌ అంబు, మా నగరం, ఇరుగపట్రు చిత్రాల్లో నటించాడు. 2023లో తమిళ బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో పాల్గొన్నాడు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల నాలుగు రోజులకే బయటకు వచ్చేశాడు. ప్రస్తుతం ఇతడు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. బక్కచిక్కిపోయి పొడవు జుట్టుతో కనిపిస్తున్నాడు. సోషల్‌ మీడియాలోనూ అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు షేర్‌ చేస్తున్నాడు. 

మానసిక స్థితి?
ఇది చూసిన అభిమానులు శ్రీకి ఏమైంది? అని కంగారుపడుతున్నారు. తన మానసిక స్థితి సరిగానే ఉందా? లేదా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడా? అని ఆరా తీస్తున్నారు. కొందరైతే శ్రీతో కలిసి మా నగరం సినిమా తీసిన లోకేశ్‌ కగనరాజ్‌ను ట్యాగ్‌ చేస్తూ శ్రీ గురించి పట్టించుకోమని కోరుతున్నారు.

 

చదవండి: గొప్ప నటి.. చివరి రోజుల్లో రూ.50 కోసం చేయి చాచింది.. విజయ

Advertisement
 
Advertisement
Advertisement