ప్రముఖ నటుడు శరత్‌కుమార్‌కు తీవ్ర అస్వస్ధత | Tamil Actor Sarathkumar Admitted To Hospital In Chennai | Sakshi
Sakshi News home page

Sarathkumar : నటి రాధిక భర్త శరత్‌కుమార్‌కు తీవ్ర అస్వస్థత.. హాస్పిటల్‌లో అడ్మిట్‌

Dec 11 2022 9:32 AM | Updated on Dec 11 2022 9:45 AM

Tamil Actor Sarathkumar Admitted To Hospital In Chennai - Sakshi

ప్రముఖ సీనియర్‌ నటుడు శరత్‌కుమార్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డయేరియాతో డీహైడ్రేషన్‌కు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. భార్య రాధిక, కుమార్తె వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఇప్పటికే ఆసుపత్రి వద్దకు చేరుకున్నట్లు తెలుస్తుంది.

కాగా 1986లో 'సమాజంలో స్త్రీ' అనే తెలుగు సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన శరత్‌కుమార్‌ సపోర్టింగ్‌ రోల్స్‌ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని అనతికాలంలోనే హీరోగా మారాడు. తెలుగునాట మంచి పాపులారిటీ దక్కించుకున్న శరత్‌కుమార్‌ ఇటీవలె తెలుగులో పరంపర వెబ్‌సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement