తాప్సీ 'శభాష్ మిథు' అనిపించుకునేది ఆరోజే.. | Sakshi
Sakshi News home page

Shabaash Mithu Movie: తాప్సీ 'శభాష్ మిథు' అనిపించుకునేది ఆరోజే..

Published Sat, Apr 30 2022 7:32 AM

Taapsee Pannu Shabaash Mithu Movie Release Date Fixed - Sakshi

Taapsee Pannu Shabaash Mithu Movie Release Date Fixed: శభాష్ మిథు ఆట చూపించే డేట్​ను ఫిక్స్​ చేసింది ఆ చిత్ర బృందం. నిజానికి ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది 'శభాష్ మిథు' చిత్రం. తాజాగా ఈ మూవీ రిలీజ్​ డేట్​ ఖరారు అయింది. జూలై 15న విడుదల చేయనున్నట్లు శుక్రవారం (ఏప్రిల్​ 29) ప్రకటించింది చిత్ర యూనిట్​. తాప్సీ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమాకు శ్రీజిత్​ ముఖర్జీ దర్శకత్వం వహించారు. 

ప్రముఖ భారత మహిళా క్రికెటర్​ మిథాలీ రాజ్​ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మిథాలీ రాజ్​ సాధించిన విజయాలతోపాటు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని అంశాలను మూవీలో ప్రస్తావించినట్లుగా చిత్ర యూనిట్​ ఓ సందర్భంలో పేర్కొంది. ఇక ప్రస్తుతం షారుఖ్ ఖాన్​ హీరోగా నటిస్తున్న 'డంకీ' సినిమాతో బిజీగా ఉంది తాప్సీ. ఈ సినిమాకు రాజ్​ కుమార్​ హిరాణీ దర్శకుడు.  

చదవండి: షాకింగ్‌ : న్యూడ్‌గా నటించిన హీరోయిన్‌ ఆండ్రియా?
ఇంతవరకు నేను సౌత్‌ సినిమాలే చూడలేదు: బాలీవుడ్‌ నటుడు


Advertisement
 
Advertisement