Taapse Pannu Bold Comments On Not Being Invited To Koffee With Karan Show - Sakshi
Sakshi News home page

Taapse Pannu: ఇచ్చిపడేసింది!.. 'కాఫీ విత్‌ కరణ్‌' షోపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు

Aug 8 2022 10:27 AM | Updated on Aug 8 2022 11:31 AM

Taapse Pannu Bold Comments On Not Being Invited To Koffee With Karan Show - Sakshi

సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను  ప్రస్తుతం బాలీవుడ్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకుంది. పింక్‌, తప్పడ్‌ , రష్మీ రాకెట్‌ వంటి సినిమాలతో అలరించింది. తాజాగా ఆమె నటించిన చిత్రం దోబారా ఆగస్టు 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఈ బ్యూటీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. అయితే ఇటీవలి కాలంలోహీరో, హీరోయిన్స్‌ ఎక్కువగా తమ మూవీ ప్రమోషన్స్‌ కోసం కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌-7లో పాల్గొంటున్నారు. చదవండి: మీడియాకు క్షమాపణలు చెప్పిన అమీర్‌ ఖాన్‌.. ఎందుకంటే

అయితే తాప్సీ మాత్రం ఆ షోకి వెళ్లకపోవడంపై మీడియా నుంచి ఆమెకు ఇదే ప్రశ్న ఎదురైంది. కరణ్‌ షోకు మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించడం లేదని అడగ్గా.. కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొనేంత గొప్పగా నా శృంగార జీవితం లేదు అంటూ బోల్డ్‌ ఆన్సర్‌ ఇచ్చింది.

ప్రస్తుతం కరణ్‌ షోపై తాప్సీ చేసిన ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా ఇప్పటివరకు కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొన్న సెలబ్రిటీలకు కరణ్‌ శృంగార జీవితం(సెక్స్‌ లైఫ్‌)పై అనేక ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆలియా భట్‌ ఎంత సంపాదిస్తుందో తెలుసా?

Advertisement
 
Advertisement
Advertisement