సుసానే ఖాన్‌ మంచి మనసు.. బాయ్‌ఫ్రెండ్‌ కామెంట్స్‌ వైరల్‌!

Sussanne Khan Gets Second COVID Vaccine Boyfriend Arslan Goni Comments  - Sakshi

కరోనా సెకండ్‌ డోస్‌ తీసుకున్న  సుసానే ఖాన్‌

ముంబై : ప్రముఖ బాలీవుడ్‌ నటుడు హృతిక్‌రోషన్‌ మాజీ భార్య, ది చార్‌కోల్ ప్రాజెక్ట్‌ అధినేత  సుసానే ఖాన్‌ మంగళవారం కోవిడ్‌ వ్యాక్సిన్ రెండో డోస్‌ను తీసుకున్నారు. తనతో పాటు తన టీం అందరికీ వ్యాక్సిన్‌ వేయించారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టును షేర్‌ చేశారు. 'కోవిషీల్డ్‌ రెండవ డోస్‌ను తీసుకున్నాను. ‘‘నాతో పాటు నా చార్‌కోల్‌ టీం 50 మందికి టీకాలు వేశారు. ఇందుకు సహకరించిన నా సోదరి సిమోన్‌ అరోరా, సోదరుడు అజయ్‌ అరోరారు ధన్యవాదాలు. ప్రతి ఒక్క భారతీయుడికి టీకాలు త్వరగా అందాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను'’ అని పేర్కొంది.

ఇక సుసానే ఖాన్‌ పోస్టుపై ఆమె ప్రియుడిగా ప్రచారంలో ఉన్న అర్స్లాన్ గోని కూడా స్పందించాడు. చప్పట్లు కొడుతున్నట్లున్న ఎమోజీని కామెంట్‌ రూపంలో తెలియజేశాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక వీరిద్దరి లవ్‌ ఎఫైర్‌పై గత కొంతకాలంగా రూమర్లు వస్తున్నా ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు. అయితే చాలా సార్లు జంటగా కెమెరాలకు చిక్కారు. దీంతో వీరిద్దరి మధ్యా లవ్‌ ట్రాక్‌ నడుస్తుందని బీటౌన్‌ టాక్‌. కాగా  సుసానే ఖాన్‌ పోస్టుపై టీవీ నిర్మాత ఏక్తాకపూర్‌ సహా పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు  స్పందిస్తున్నారు. తనతో పాటు టీం అందరికి వ్యాక్సిన్‌ వేయించినందుకు, మీ మనసు మంచిదంటూ ఆమెను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. 

చదవండి : అరెస్ట్‌ వార్తలపై స్పందించిన సుసానే ఖాన్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top