సుశాంత్ కేసు ఇంకెన్నాళ్లు..?

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌ది హత్యా? ఆత్మహత్యా ? ఎప్పటికి తేలుతుందని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సీబీఐని సూటిగా ప్రశ్నించారు. ఈ కేసులో సీబీఐ కొనసాగిస్తున్న విచారణపై ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని అన్నారు.
శుక్రవారం మంత్రి దేశ్‌ముఖ్ మీడియాతో మాట్లాడుతూ.. సుశాంత్ మృతిపై ముంబై పోలీసులు సరైన దిశగా విచారణ చేస్తున్న సమయంలో హఠాత్తుగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చేతుల్లోకి ఈ కేసు వెళ్లిందన్నారు. వీలైనంత త్వరగా సీబీఐ అసలు నిజాలను రాబట్టాలన్నారు. ఇప్పటికే సీబీఐ విచారణ చేపట్టి 45 రోజులు గడిచినా ముందుకు అడుగు పడలేదని మంత్రి దేశ్‌ముఖ్ తెలిపారు. (సుశాంత్ కేసులో మరో మలుపు)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి